Meg Lanning Retairment : 31 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చిన స్టార్ మహిళా క్రికెటర్..!
ఆస్ట్రేలియా(Australia) మహిళా క్రికెట్(Lady Cricketer) జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్(Meg Lanning) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై 2023 టీ20 ప్రపంచకప్(World Cup) గెలిచిన తర్వాత.. ఆమె ఆస్ట్రేలియా తరఫున ఆడలేదు. గాయపడిన ఆమె మళ్లీ ఫిట్‌గా ఉన్నప్పటికీ..
ఆస్ట్రేలియా(Australia) మహిళా క్రికెట్(Lady Cricketer) జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్(Meg Lanning) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై 2023 టీ20 ప్రపంచకప్(World Cup) గెలిచిన తర్వాత.. ఆమె ఆస్ట్రేలియా తరఫున ఆడలేదు. గాయపడిన ఆమె మళ్లీ ఫిట్‌గా ఉన్నప్పటికీ.. వెస్టిండీస్‌తో(West Indies) జరిగిన టీ20 సిరీస్‌లో ఆడలేదు. లానింగ్ వయస్సు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. దీంతో ఆమె రిటైర్మెంట్(Retairment) నిర్ణయంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వైదొలగడం కష్టమని మెగ్ లానింగ్ తెలిపింది. కానీ ఇప్పుడు నాకు సరైన సమయం అని నేను అనుకుంటున్నాను. నేను 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌ను ఆస్వాదించిన అదృష్టాన్ని పొందాను. జట్టు విజయం కోసం క్రీడలు ఆడతారు. నేను సాధించగలిగిన దాని గురించి నేను గర్వపడుతున్నాను. నా సహచరులతో నేను పంచుకున్న క్షణాలను ఎంతో ఆదరిస్తాను.
నా కుటుంబం, నా సహచరులు, క్రికెట్ విక్టోరియా, క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ల మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా అంతర్జాతీయ కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొంది. లానింగ్ ప్రస్తుతం WBBLలో మెల్‌బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉంది. అయితే ఆమె దేశవాళీ క్రికెట్ కెరీర్‌ను కొనసాగించడానికి సిద్ధంగా ఉంది.
మెగ్ లానింగ్ గత కొంత కాలంగా ఆట నుంచి నుండి చాలా సార్లు విరామం తీసుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2022లో బంగారు పతకం సాధించిన తర్వాత క్రికెట్‌కు విరామం ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్‌లో జరిగిన భారత పర్యటనకు దూరమైంది. లానింగ్ 18 ఏళ్ల వయసులో 2010లో ఆస్ట్రేలియా తరఫున టీ20ఐ అరంగేట్రం చేసింది. ఆమె ఇప్పటివరకూ ఆరు టెస్టులు, 103 వన్డేలు, 132 టీ20లతో మొత్తం ఆస్ట్రేలియా తరపున 241 మ్యాచ్‌లు ఆడింది. మొత్తం మూడు ఫార్మాట్లలో ఆమె పేరిట 8,000 కంటే ఎక్కువ పరుగులు ఉన్నాయి.
మెగ్ లానింగ్ ఆస్ట్రేలియా తరపున 5 టీ20 ప్రపంచ కప్‌లు, రెండు ODI ప్రపంచకప్ టైటిల్‌లు, కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా ఆమె నిలిచిపోనుంది. ఆస్ట్రేలియాకు 182 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 2014లో ఆమె కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించింది.