ఐపీఎల్ 2023(IPL 2023)లో నాకౌట్ రౌండ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు ఓడిపోతుందో.. దాని ప్రయాణం ముగుస్తుంది. ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ముంబై ఇండియన్స్(Mumbai Indians) మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌తో నాకౌట్ రౌండ్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.
ఐపీఎల్ 2023(IPL 2023)లో నాకౌట్ రౌండ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు ఓడిపోతుందో.. దాని ప్రయాణం ముగుస్తుంది. ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ముంబై ఇండియన్స్(Mumbai Indians) మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌తో నాకౌట్ రౌండ్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకూ అత్యధికంగా ఐదు టైటిళ్లను గెలుచుకుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకూ రెండు సార్లు ప్లేఆప్స్‌కు అర్హత సాధించింది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు హోరాహోరిగా ఉండనుంది.
చెపాక్ స్టేడియం(Chepauk Stadium)లో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. అయితే లీగ్ దశలో లక్నో జట్టు ముంబై చేతిలో ఓడిపోలేదు. లక్నో జట్టు ముంబైపై తమ చివరి మూడు మ్యాచ్‌లను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయడం ద్వారా.. టైటిల్ రేసుకు దగ్గరవ్వాలని చూస్తుంది.
ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటికిపోతుంది. గెలిచిన జట్టు ఫైనల్ చేరాలంటే మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు.. క్వాలిఫయర్-2లో ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ ఇప్పుడు క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది. లక్నో, ముంబై నుంచి గెలిచిన జట్టు క్వాలిఫయర్-2తో ఆడుతుంది. ఓడిన జట్టు ప్రయాణం ఇక్కడితో ముగుస్తుంది.
ఇక ఇరు జట్లు ఇప్పటి వరకూ రాణించిన ఆటగాళ్లనే ప్లేయింగ్-11 లో కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకటి, రెండు మినహా పెద్దగా మార్పులు ఉండబోవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు జట్ల ప్లేయింగ్-11 మెంబర్స్ వివరాలు..
లక్నో సూపర్ జెయింట్స్:
కైల్ మేయర్స్, క్వింటన్ డికాక్ (WK), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా (సి), నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్.
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్ (WK), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ/విష్ణు వినోద్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, రితిక్ షోకీన్.