ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ చెన్నై పై ఘన విజయాన్ని

ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ చెన్నై పై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత మైదానంలో 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లక్నో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలోనే టార్గెట్ ను ఛేదించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్, క్వింటన్ డికాక్ అర్ధసెంచరీ మెరిశారు. 53 బంతుల్లో 82 పరుగులతో కెప్టెన్ కేఎల్ రాహుల్ లక్నో గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. క్వింటన్ డికాక్‌ కూడా అర్ధ సెంచరీతో (54) రాణించాడు. ఆఖర్లో పూరన్‌ (23 నాటౌట్‌), స్టోయినిస్‌ (8 నాటౌట్‌) ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచ్ ను ముగించారు. చెన్నై బౌలర్లలో మతీశ పతిరన, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీశారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 57 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లలో రహానె (36), మొయిన్‌ అలీ (30), ఎంఎస్ ధోని (28 నాటౌట్‌) చేశారు. 17 ఓవర్లలో 123 పరుగులుగా ఉన్న చెన్నై స్కోరు ధోనీ రాకతో 20 ఓవర్లు ముగిసే సరికి 176 పరుగులకు చేరింది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు, మోహ్సిన్ ఖాన్, యశ్ థాకూర్, రవి బిష్ణోయ్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు.

Updated On 19 April 2024 9:39 PM GMT
Yagnik

Yagnik

Next Story