మరో రెండు నెలల వరకు క్రికెట్‌ లవర్స్‌(Cricket Lovers)కు పెద్ద పండుగే! శుక్రవారం నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌(IPL) కోసం కళ్లింత చేసుకుని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. గత ఐపీఎల్‌ టోర్నమెంట్‌తో పోలిస్తే ఈసారి కొందరు కీలకమైన ఆటగాళ్లు ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. ఇలా దూరమైనవారందరూ గాయాలబారిన పడినవారే కావడం గమనార్హం.

మరో రెండు నెలల వరకు క్రికెట్‌ లవర్స్‌(Cricket Lovers)కు పెద్ద పండుగే! శుక్రవారం నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌(IPL) కోసం కళ్లింత చేసుకుని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. గత ఐపీఎల్‌ టోర్నమెంట్‌తో పోలిస్తే ఈసారి కొందరు కీలకమైన ఆటగాళ్లు ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. ఇలా దూరమైనవారందరూ గాయాలబారిన పడినవారే కావడం గమనార్హం. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)కు సారథ్యం వహించిన రిషబ్‌ పంత్‌(Rishabh Pant) ఇప్పుడు ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. గత సంవత్సరం డిసెంబర్‌లో ఇతడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనేక సర్జరీల తర్వాత పంత్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఢిల్లీ విజయాలలో ఇతడి కాంట్రిబ్యూషన్‌ ఎక్కువే. పంత్‌ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే. పంత్‌ ప్లేస్‌లో డేవిడ్‌ వార్నర్‌(David Warner)కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది టీమ్‌ మేనేజ్‌మెంట్‌. టీమ్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు పంత్‌తో ఓ ప్రమోషనల్‌ వీడియోను రూపొందించింది ఢిల్లీ క్యాపిటల్స్‌. అలాగే కొన్ని మ్యాచ్‌లకైనా పంత్‌ను డగౌట్‌లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ పాంటింగ్‌ అంటున్నాను..

టీమిండియా స్టార్‌ పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah)కూడా ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. కారణం వెన్ను నొప్పి. గత ఆరు నెలలుగా బుమ్రా క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. బుమ్రా లేకపోవడంతో ముంబాయి ఇండియన్స్‌ జట్టు కాసింత బలహీనపడింది. బుమ్రా స్థానంలో జఫ్రా ఆర్చర్‌ను జట్టులో తీసుకున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌Shreyas Iyer)ది కూడా ఇదే ప్రాబ్లమ్‌. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌లో సభ్యుడైన శ్రేయస్‌ అయ్యర్‌ గత రెండు నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి రిస్క్‌ తీసుకోకూడదని శ్రేయస్‌ అయ్యర్‌ భావించి ఐపీఎల్‌ నుంచి వైదొలిగాడు. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో నితీష్‌ రాణా(Nitish Rana)ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది టీమ్‌ మేనేజ్‌మెంట్‌. ఇంగ్లాండ్‌ వికెట్ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో కాలికి శస్త్రచికిత్స జరిగింది. కొన్నాళ్ల పాటు విశ్రాంతి అవసరం. అందుకే ఇతడు ఐపీఎల్‌కు దూరమవుతున్నాడు. దీంతో పంజాబ్‌ కింగ్స్‌ జట్టు బెయిర్‌స్టో ప్లేస్‌లో మాథ్యూ షార్ట్‌Matt Short)ను తీసుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ పేస్‌ బౌలర్‌ ప్రసిద్‌ కృష్ణ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. లాస్టియర్‌ ఆగస్టు నుంచే ఇతడు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇతడి స్థానంలో సందీప్‌శర్మను జట్టులో తీసుకున్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడైన రజత్‌ పటిదార్‌ మడమ గాయంతో బాధపడుతున్నారు. లాస్టియర్‌ అద్భుతమైన సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన రజత్‌ పటిదార్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ ఆకాడమీలో ఉంటున్నాడు. ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లలో ఇతను పాల్గొనవడం కష్టమే కానీ రెండో దశ మ్యాచ్‌లకు అందుబాటులో రావొచ్చు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ బౌలర్‌ ముఖేశ్‌ చౌదరి కూడా ఈ సీజన్‌లో ఆడే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే ముఖేశ్‌ త్వరగా కోలుకొని జట్టులోకి వస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు చెన్నై సూపర్‌కింగ్స్‌ సీఈవో కాశీ విశ్వనాథ్‌. ఆస్ట్రేలియా ప్లేయర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ కూడా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. గాయం కారణంగా ఇతడు ఇండియాతో జరిగిన సిరీస్‌కు దూరమయ్యాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌లో ఇతడు కీలక బౌలర్‌.. లాస్ట్‌ సీజన్‌లో హేజిల్‌వుడ్‌ 20 వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ కైల్ జేమీసన్‌ వెన్ను నొప్పి కారణంగా గత తొమ్మిది నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇతడి ప్లేస్‌లో దక్షిణాఫ్రికా పేసర్‌ సిసిందాను టీమ్‌లో తీసుకుంది చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఆస్ట్రేలియా ప్లేయర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కూడా ఐపీఎల్ టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. మోకాలి గాయం కారణంగానే ఇండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడలేదు. ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్‌ ఉంది కాబట్టి అవసరంగా రిస్క్‌ తీసుకోవడం ఎందుకని ఆసీస్‌ కోచ్‌ భావిస్తున్నారు.

Updated On 30 March 2023 3:57 AM GMT
Ehatv

Ehatv

Next Story