కోల్‌కతా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది

కోల్‌కతా నైట్ రైడర్స్ పై రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. సెంచరీ చేసి నరైన్ కోల్ కతాకు భారీ స్కోరు అందించినా.. రాజస్థాన్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్ తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసి కోల్‌కతా నిర్దేశించిన 224 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 8 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. గాయం కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన 60 బంతుల్లో 107 పరుగులు బాది చివరి వరకు క్రీజులో ఉన్నాడు. ఏకంగా 9 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. బట్లర్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ (34), పావెల్‌ (26) రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ కీలక బ్యాటర్లు జైస్వాల్‌ (19), సంజు శాంసన్‌ (12), ధ్రువ్‌ జురెల్‌ (2), అశ్విన్‌ (8), హెట్‌మయర్‌ (0) విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు, వైభవ్ అరోరా ఒక వికెట్ చొప్పున తీశారు.

సునీల్ నరైన్ సూపర్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించింది. కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. నరైన్ 56 బంతుల్లో 13 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. కోల్ కతా బ్యాటర్ల లో రఘువంశీ 30, రింకూ సింగ్ 20 (నాటౌట్), ఆండ్రీ రసెల్ 13, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 11 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 2, కుల్దీప్ సేన్ 2, బౌల్ట్ 1, చహల్ 1 వికెట్ తీశారు.

Updated On 16 April 2024 8:52 PM GMT
Yagnik

Yagnik

Next Story