ఐపీఎల్-2023లో భాగంగా జ‌రిగిన‌ 36వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 21 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ బోర్డుపై 200 పరుగులు ఉంచింది. బ‌దులుగా ఆర్‌సీబీ జట్టు 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 వరుస పరాజయాల తర్వాత కేకేఆర్‌కి ఇదే తొలి విజయం.

ఐపీఎల్-2023లో భాగంగా జ‌రిగిన‌ 36వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌(Kolkata Knight Riders).. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ(RCB) 21 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్(KKR) బోర్డుపై 200 పరుగులు ఉంచింది. బ‌దులుగా ఆర్‌సీబీ జట్టు 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 వరుస పరాజయాల తర్వాత కేకేఆర్‌కి ఇదే తొలి విజయం.

ఆర్‌సీబీకి ఓపెనర్ ఫాఫ్ డు ప్లెసిస్(Faf du Plessis) 17 పరుగులు చేసి అవుటయ్యాడు. షాబాజ్ అహ్మద్(Shabaz Ahmad) (2) త్వ‌ర‌గా వెనుదిరిగాడు. వెంట‌నే గ్లెన్ మాక్స్‌వెల్(Glenn Maxwell) కూడా 5 పరుగులకే పెవిలియ‌న్ చేరాడు. ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్ (34) విరాట్ కోహ్లీ(Virat Kohli)తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ 54 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. దినేష్ కార్తీక్(Dinesh Karthik) మ్యాచ్‌ను ముగిస్తాడ‌ని భావించారు. కేవ‌లం 22 పరుగులు మాత్ర‌మే చేసి వెనుదిరిగాడు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి(Varun Chakravarthi) మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అండ్రూ ర‌స్సెల్‌(Andrew Russel), సుయాశ్(Suyash Sharma) శ‌ర్మ త‌లా రెండు వికెట్లు ద‌క్కించుకున్నారు.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 200 పరుగులమార్కును ధాటింది. ఆరంభం నుంచి కేకేఆర్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. జాసన్ రాయ్(Jason Roy) (56) ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే బలమైన షాట్లు ఆడాడు. ఎన్ జగ‌దీషన్(N Jagadeeshan) కూడా 27 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyyer) 31, నితీష్ రాణా(Nitish Rana) 41 పరుగులు చేశారు. చివర్లో రింకు సింగ్(Rinku Singh) 18, డేవిడ్ వీస్(13) వేగంగా పరుగులు చేయ‌డం స్కోరు 200కు చేరుకుంది. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో హ‌స‌రంగ‌(Hasaranga), వైశాఖ్(Vyshak) త‌లా రెండేసీ వికెట్లు ప‌డ‌గొట్టారు.

Updated On 26 April 2023 11:13 PM GMT
Yagnik

Yagnik

Next Story