బెంగళూరు చిన్నస్వామి స్టేడియం(Bangalore Chinnaswamy Stadium) అభిమానుల కేరింతలు, అరుపులతో పాటుగా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తింది. అందుకు కారణం విరాట్‌ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్‌లో దుమ్ము దులపడం. ఐపీఎల్‌(IPL)లో అయిదుసార్లు విజేతగా నిలిచిన ముంబాయి జట్టును బెంగుళూరు జట్టు ఓ ఆటాడేసుకుంది. కోహ్లీ(Kohli), డుప్లెసిస్‌(du Plessis) అయితే ముంబాయి బౌలింగ్‌లో చీల్చి చెండాడారు.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం(Bangalore Chinnaswamy Stadium) అభిమానుల కేరింతలు, అరుపులతో పాటుగా బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తింది. అందుకు కారణం విరాట్‌ కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్‌లో దుమ్ము దులపడం. ఐపీఎల్‌(IPL)లో అయిదుసార్లు విజేతగా నిలిచిన ముంబాయి జట్టును బెంగుళూరు జట్టు ఓ ఆటాడేసుకుంది. కోహ్లీ(Kohli), డుప్లెసిస్‌(du Plessis) అయితే ముంబాయి బౌలింగ్‌లో చీల్చి చెండాడారు. ఫలితంగా ముంబాయి(Mumbai)పై బెంగళూరు((Bangalore) ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబాయి ఇండియన్స్‌(Mumbai Indians) ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబాయి జట్టును హైదరాబాద్‌ ప్లేయర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ(Thakur Tilak Varma) ఆదుకున్నాడు. 46 బంతుల్లో తొమ్మిది బౌండరీలు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 84 పరుగులు చేశాడు. తిలక్‌వర్మ కారణంగానే ముంబాయి ఈ మాత్రం పరుగులైనా చేయగలిగింది. టాప్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమయ్యింది. పవర్‌ప్లేలో మూడు కీలకమైన వికెట్లను చేజార్చుకుంది. సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) ఈ మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు.

భారీ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు జట్టుకు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్‌లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కోహ్లీ ఆరు ఫోర్లు, అయిదు సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేస్తే, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డుప్లెసిస్‌ అయిదు బౌండరీలు, ఆరు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 14.5 ఓవర్లలో 148 పరుగులు జోడించారు. డుప్లెసిస్‌ అవుటయ్యాక వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ సున్నాకే అవుటయ్యాడు. తర్వాత మ్యాక్స్‌వెల్‌ మూడు బంతుల్లో రెండు సిక్సర్లతో అజేయంగా 12 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీ ఏడు పరుగులున్నప్పుడు బౌలర్‌ ఆర్చర్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. కాకపోతే ఆర్చర్‌ దాన్ని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 50 హాఫ్‌ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకు ముందు ఈ ఫీట్‌ను డేవిడ్‌ వార్నర్‌ చేశాడు. వీరిద్దరు ఇప్పటి వరకు 50 అర్ధ సెంచరీలు చేశారు. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఖాతాలో 49 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

స్కోరు బోర్డు
ముంబై ఇండియన్స్‌(Mumbai Indians) :
రోహిత్‌ శర్మ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 1; ఇషాన్‌ కిషన్‌ (సి) హర్షల్‌ పటేల్‌ (బి) సిరాజ్‌ 10, గ్రీన్‌ (బి) టాప్లే 5; సూర్యకుమార్‌ యాదవ్‌ (సి) షహబాజ్‌ (బి) బ్రేస్‌వెల్‌ 15; తిలక్‌ వర్మ (నాటౌట్‌) 84; నేహల్‌ వధేరా (సి) కోహ్లి (బి) కరణ్‌ శర్మ 21; టిమ్‌ డేవిడ్‌ (బి) కరణ్‌ శర్మ 4; హృతిక్‌ షోకీన్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 5; అర్షద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1–11, 2–16, 3–20, 4–48, 5–98, 6–105, 7–123. బౌలింగ్‌: సిరాజ్‌ 4–0–21–1, రీస్‌ టాప్లే 2–0–14–1, ఆకాశ్‌దీప్‌ 3–0–29–1, హర్షల్‌ పటేల్‌ 4–0–43–1, కరణ్‌ శర్మ 4–0–32–2, బ్రేస్‌వెల్‌ 2–0–16–1, మ్యాక్స్‌వెల్‌ 1–0–16–0.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore) :
విరాట్‌ కోహ్లి (నాటౌట్‌) 82; డు ప్లెసిస్‌ (సి) టిమ్‌ డేవిడ్‌ (బి) అర్షద్‌ ఖాన్‌ 73; దినేశ్‌ కార్తీక్‌ (సి) తిలక్‌ వర్మ (బి) గ్రీన్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో రెండు వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–148, 2–149.
బౌలింగ్‌: బెహ్రెన్‌డార్ఫ్‌ 3–0–37–0, అర్షద్‌ ఖాన్‌ 2.2–0–28–1, జోఫ్రా ఆర్చర్‌ 4–0–33–0, పియూష్‌ చావ్లా 4–0–26–0, కామెరాన్‌ గ్రీన్‌ 2–0–30–1, హృతిక్‌ షోకీన్‌ 1–0–17–0.

Updated On 2 April 2023 11:36 PM GMT
Ehatv

Ehatv

Next Story