విరాట్ కొడుకు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏమిటా అనే చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ మరోసారి తండ్రయ్యాడు. అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు కోహ్లీ, అనుష్క సంయుక్తంగా ఓ ప్రకటనలో తెలిపారు. తమకు ఫిబ్రవరి 15న మగబిడ్డ కలిగినట్టు వెల్లడించారు. తమ బిడ్డకు అకాయ్ (Akaay) అని నామకరణం చేసినట్టు కోహ్లీ, అనుష్క తమ ప్రకటనలో వివరించారు. ఈ శుభసమయంలో మీ ఆశీస్సులు కోరుకుంటున్నామని, అదే సమయంలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరుకుంటున్నామని తెలిపారు. కోహ్లీ, అనుష్క 2017లో పెళ్లితో ఒక్కటయ్యారు. 2021లో అనుష్క శర్మ వామికకు జన్మనిచ్చారు. పర్సనల్ రీజన్స్ కారణంగా విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్నారు.

విరాట్ కొడుకు ‘అకాయ్’ పేరుకు అర్థం ఏమిటా అనే చర్చ మొదలైంది. కోహ్లీ ప్రకటన తర్వాత ఈ పేరుకి అర్థంపై సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు. హిందీ పదం 'కాయ' నుంచి ఈ పేరు వచ్చిందని, కాయ అంటే 'శరీరం' అని అంటున్నారు. ఇక అకాయ్ అంటే ‘భౌతిక శరీరాన్ని మించిన ఎవరైనా ఓ వ్యక్తి’ అని పలువురు వివరణ ఇస్తున్నారు. ఇక టర్కిష్ భాషలో 'అకాయ్' అంటే 'ప్రకాశవంతమైన చంద్రుడు' అని అర్థమని నెటిజన్లు చెబుతున్నారు.

Updated On 20 Feb 2024 11:04 PM GMT
Yagnik

Yagnik

Next Story