క్రికెట్(Cricket) అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్(One Day world Cup) మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గురువారం అహ్మదాబాద్‌లో ఆరంభ వేడుకలు జరుగుతాయి. తర్వాత తొలి మ్యాచ్‌లో డిఫెడింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌తో(England) న్యూజిలాండ్(New zealand) పోటీపడుతుంది.
క్రికెట్(Cricket) అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్(One Day world Cup) మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గురువారం అహ్మదాబాద్‌లో ఆరంభ వేడుకలు జరుగుతాయి. తర్వాత తొలి మ్యాచ్‌లో డిఫెడింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌తో(England) న్యూజిలాండ్(New zealand) పోటీపడుతుంది. ఈ సందర్భంగా వన్డే ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ(Fastest Century) ఎవరి పేరిట ఉందో తెలుసుకుందాం! అత్యంత వేగవంతమైన సెంచరీ ఏ ఆస్ట్రేలియా(australia) ఆటగాడో, ఏ వెస్టిండీస్ ఆటగాడో చేసి ఉంటాడని అనుకుంటున్నారు కదూ! అయితే మీరు హిట్ వికెట్ అయినట్టే! ఈ రికార్డు ఐర్లాండ్(Ireland) ఆటగాడు కెవిన్ ఓబ్రియన్(Kevin Obrian) పేరిట ఉంది.
ఇండియాలో 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఓబ్రియన్ ఈ రికార్డు సెంచరీ నమోదు చేశాడు. అది కూడా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో! మూడెంకల స్కోరును ఇతడు కేవలం 50 బంతుల్లోనే సాధించి రికార్డు సాధించాడు. ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలో దిగిన ఓబ్రియన్ వచ్చే రావడంతో ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న ఓబ్రియాన్ 13 బౌండరీలు, ఆరు సిక్స్‌లతో 113 పరుగులు చేశాడు.
ఇంగ్లండ్‌పై 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఓబ్రియాన్ కీలక పాత్ర పోషించాడు.ఇతడి ఇన్నింగ్స్ వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఓబ్రియాన్ తర్వాతి స్థానం ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు(Glenn Maxwell) దక్కుతుంది. 2015లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మాక్స్‌వెల్ వీర విహారం చేశాడు. జస్ట్ 51 బాల్స్‌లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 53 బంతలను ఎదుర్కొన్న మాక్స్‌వెల్ పది బౌండరీలు, నాలుగు సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన లెజెండ్ ఏబీ డివిలియర్స్(AB de Villiers) తక్కువేమీ తినలేదు. 2015 ప్రపంచకప్ టోర్నీలోనే వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ కదం తొక్కాడు. కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తంగా 66 బాల్స్‌ను ఆడిన డివిలియర్స్ 17 ఫోర్లు, ఎనిమిది సిక్స్‌లతో 162 పరుగులు చేశాడు. ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(Eoin Morgan) కూడా చోటు సంపాదించుకున్నాడు. 2019లో ఇంగ్లాండ్‌లోనే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్ ఈ రికార్డు సాధించాడు. 57 బంతుల్లోనే మూడెంకల స్కోరు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 71 బంతులు ఆడిన మోర్గాన్ నాలుగు ఫోర్లు, 17 సిక్స్‌లతో 148 పరుగులు చేశాడు.