సెప్టెంబర్, 2022 నుంచి గాయం కారణంగా బుమ్రా సుమారు ఏడాది పాటు టీమిండియాకు దూరంగా ఉన్నాడు

ఐసీసీ రిలీజ్ చేసిన టెస్టు ర్యాంకుల్లో జస్‌ప్రీత్ బుమ్రా నంబర్ వన్ గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ పేస్ బౌలర్ గా అతడు రికార్డు క్రియేట్ చేశాడు. అయితే బుమ్రా తన ఇన్‌స్టా స్టోరీస్ లో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. స్టేడియంలోని గ్యాలరీలో ఒకే వ్యక్తి కూర్చున్న ఫొటోతోపాటు కింద స్టేడియం ఫుల్లుగా ఉన్న మరో ఫొటోను పోస్ట్ చేశాడు. సపోర్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రారు కానీ.. శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రం అందరూ వస్తారని కామెంట్ చేశాడు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు పెద్దగా మద్దతు రాలేదని ఈ పోస్టు ద్వారా కోపం చూపించాడు. ఇప్పుడు నంబర్ వన్ ర్యాంక్ రాగానే అందరూ తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చేస్తున్నారని.. ఆ పోస్టు ద్వారా తెలిపారు. శుభాకాంక్షలు చెప్పడానికి వేల మంది రెడీగా ఉంటారు కానీ.. సపోర్ట్ చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రారని గతంలో చాలా మందే చెప్పారు. ఆ కోవ లోకే పాపం బుమ్రా కూడా వస్తూ ఉండడం నిజంగా బాధాకరమే!

సెప్టెంబర్, 2022 నుంచి గాయం కారణంగా బుమ్రా సుమారు ఏడాది పాటు టీమిండియాకు దూరంగా ఉన్నాడు. వెన్ను గాయం అతనిపై చాలా ప్రభావమే చూపింది. 2023లో ఐర్లాండ్ సిరీస్ నుంచి మళ్లీ అతడు జట్టులోకి వచ్చాడు. విశాఖపట్నం టెస్టులో 9 వికెట్లతో ఇంగ్లండ్ పని పట్టి టెస్టుల్లో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకు సాధించాడు. బుమ్రా గాయాల పాలైనప్పుడు ఎంతో మంది ఐపీఎల్ కు అయితే బుమ్రా అందుబాటులో ఉంటాడు కానీ.. టీమిండియా కోసం మాత్రం సిద్ధమవ్వడంటూ చాలానే విమర్శలు చేశారు. అది గుర్తు పెట్టుకునే బుమ్రా ఈ పోస్టు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Updated On 7 Feb 2024 10:34 PM GMT
Yagnik

Yagnik

Next Story