ఐపీఎల్-2023లో భాగంగా జరిగిన 56వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ప్లేఆఫ్ రేసులో నిలవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు 13.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.
ఐపీఎల్-2023లో భాగంగా జరిగిన 56వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)పై ఘన విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో ఈ మ్యాచ్ జరిగింది. ప్లేఆఫ్ రేసు(Palyoff Race)లో నిలవడానికి ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఈ విజయంతో రాజస్థాన్ (Rajasthan)జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 150 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు 13.1 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా తరుపున వెంకటేష్ అయ్యర్(Venkatesh Iyer) 57 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. రాజస్థాన్ తరఫున యుజువేంద్ర చాహల్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్(Trent Boult) కూడా రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ జట్టు.. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(Jashaswi Jaishwal) ఆరంభం నుంచే లాఠీచార్జి చేసినట్లుగా కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ కెప్టెన్ నితీష్ రాణా(Nitish Rana) వేయగా.. 26 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత 13 బంతుల్లోనే అర్ధసెంచరీ కొట్టి ఐపీఎల్ పాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే జైస్వాల్ 47 బంతుల్లో అజేయంగా 98 పరుగులు, కెప్టెన్ సంజూ శాంసన్ 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. రాజస్థాన్ 13.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని నమోదు చేసింది.
ఈ ఓటమి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు విజయాలు, ఏడు ఓటములతో 12 మ్యాచ్‌లలో కేవలం 10 పాయింట్లను మాత్రమే కలిగి ఉంది. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా ఆ జట్టుకు 14 పాయింట్లు ఉంటాయి. ప్రస్తుత పాయింట్ల పట్టిక పరిస్థితి ప్రకారం మొదటి-4కు జట్లలో కేకేఆర్ ఉంటుందని చెప్పడం కష్టమే.
రాజస్థాన్ విజయంతో పాయింట్ల పట్టికలో మార్పులు చోటుచేసుకోగా.. ముంబై ఇండియన్స్ నాలుగో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానంలో గుజరాత్ టైటాన్స్, రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి. రాజస్థాన్, ముంబై జట్లు 12-12 పాయింట్లతో ఉన్నాయి. మరోవైపు లక్నో సూపర్ జెయింట్ 11 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ రేసు ఇంకా కొనసాగుతంది. అయితే ఢిల్లీ, కోల్‌కతా ఆశలు దాదాపు ముగిశాయి.