రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore), లక్నో సూపర్‌ జెయింట్స్‌(Lucknow Super Giants) మధ్య వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియం(Ekana Stadium)లో జరిగిన మ్యాచ్‌ ఆద్యంతమూ ఉత్కంఠభరితంగా సాగింది. స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో బెంగళూరు విజయంసాధించింది. మ్యాచ్‌ తర్వాత విరాట్‌ కోహ్లీ(Virat Kohli), గౌతం గంభీర్‌(Gautam Gambhir)లు గ్రౌండ్‌లోనే గొడవపడ్డారు. వీరితో పాటు గొడవకు పరోక్షంగా కారణమైన నవీన్‌-ఉల్‌-హక్‌లకు భారీ జరిమానా విధించారు ఐపీఎల్‌ నిర్వాహకులు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(Royal Challengers Bangalore), లక్నో సూపర్‌ జెయింట్స్‌(Lucknow Super Giants) మధ్య వాజ్‌పేయి ఏకనా క్రికెట్‌ స్టేడియం(Ekana Stadium)లో జరిగిన మ్యాచ్‌ ఆద్యంతమూ ఉత్కంఠభరితంగా సాగింది. స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో బెంగళూరు విజయంసాధించింది. మ్యాచ్‌ తర్వాత విరాట్‌ కోహ్లీ(Virat Kohli), గౌతం గంభీర్‌(Gautam Gambhir)లు గ్రౌండ్‌లోనే గొడవపడ్డారు. వీరితో పాటు గొడవకు పరోక్షంగా కారణమైన నవీన్‌-ఉల్‌-హక్‌లకు భారీ జరిమానా విధించారు ఐపీఎల్‌ నిర్వాహకులు. కోహ్లీ, గంభీర్‌ మ్యాచ్‌ ఫీజులో వంద శాతం, నవీన్‌-ఉల్‌-హక్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండ‌క్ట్ లెవెల్ 2 ఆర్టిక‌ల్ 2.21 కింద ఈ ముగ్గిరికి ఈ జ‌రిమానా విధించిన‌ట్లు ఐపీఎల్‌ తెలిపింది. కోహ్లీకి 1.07 కోట్ల రూపాయల కోత విధిస్తే, గౌతం గంభీర్‌కు పాతిక లక్షల కోత పడింది. నవీన్‌-ఉల్‌-హక్‌కు 1.79 లక్షల రూపాయల ఫైన్‌ వేశారు.

కోహ్లీని ఎవరూ కవ్వించకూడదు. అప్పుడు సైలెంట్‌గా ఉంటాడు కానీ తనకు ఛాన్స్‌ దొరికినప్పుడు అంతకు రెట్టింపు సమాధానం చెబుతాడు. గత నెల 10వ తేదీన జరిగిన మ్యాచ్‌లో బెంగళూరును దాని సొంత గడ్డపై లక్నో ఓడించింది అప్పుడు స్టేడియంలో ఉన్న బెంగళూరు అభిమానులవైపు చూస్తూ ఇక నోటికి తాళాలు వేసుకోమన్నట్టుగా లక్నో మెంటార్‌ గంభీర్‌ సైగలు చేశాడు. అది మనసులో పెట్టుకున్న కోహ్లీ నిన్నటి మ్యాచ్‌లో బెంగళూరు గెలుస్తుందని ఖాయమైన తర్వాత రెచ్చిపోయాడు. కృణాల్‌ క్యాచ్‌ను అందుకున్నప్పుడు గంభీర్‌లా చేయకూడదని సూచిస్తూ, ముద్దు పెడుతున్నట్టు సైగ చేశారు. వికెట్ పడిన ప్రతీసారి విపరీతంగా సంబరాలు చేశాడు. ఇక మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా కోహ్లీ, గంభీర్‌ మధ్య గొడవ జరిగింది. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే టైమ్‌లో కోహ్లీ, లక్నో టీమ్‌ పేసర్‌ నవీన్‌-ఉల్‌-హక్‌ మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్‌ మైర్స్‌తో కోహ్లీ మాట్లాడుతున్నప్పుడు గంభీర్‌ కల్పించుకున్నాడు. అతడితో మాట్లాడవద్దంటూ మైర్స్‌ను తీసుకెళ్లిపోయాడు. దాంతో కోహ్లీ, గంభీర్‌ మధ్య వాగ్వాదం మొదలయ్యింది. అది గొడవకు దారి తీసింది. సహచర ఆటగాళ్లు కల్పించుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.

Updated On 1 May 2023 11:33 PM GMT
Ehatv

Ehatv

Next Story