గాయం కారణంగా కెప్టెన్ కేఎల్‌ రాహుల్(KL Rahul) ఐపీఎల్‌-2023(IPL 2023) మిగిలిన సీజన్‌కు దూరమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(RCB) జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రాహుల్‌ గాయపడ్డాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై(CSK) కూడా ఆడలేదు.

గాయం కారణంగా కెప్టెన్ కేఎల్‌ రాహుల్(KL Rahul) ఐపీఎల్‌-2023(IPL 2023) మిగిలిన సీజన్‌కు దూరమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో(RCB) జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రాహుల్‌ గాయపడ్డాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై(CSK) కూడా ఆడలేదు. దీంతో రాహుల్ స్థానంలో అనుభవజ్ఞుడైన కరుణ్ నాయర్‌ని(Karun Nair) లక్నో జట్టులోకి తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో కరుణ్ నాయ‌ర్ పేరిట ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.

కరుణ్ నాయర్‌ను 50 లక్షలకు ల‌క్నో(Lucknow) జట్టులోకి చేర్చుకుంది. భారత్ తరఫున ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు నాయ‌ర్‌. టెస్టుల్లో 62.33 సగటుతో 374 పరుగులు, వన్డేల్లో 23 సగటుతో 46 పరుగులు చేశాడు. టెస్టులో అతని అత్యుత్తమ స్కోరు 303 నాటౌట్. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ట్రిపుల్ సెంచ‌రీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరుణ్ 76 ఐపీఎల్ మ్యాచ్‌లలో 23.75 సగటు, 127.75 స్ట్రైక్ రేట్‌తో 1,496 పరుగులు చేశాడు.

కరుణ్ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), రాజస్థాన్ రాయల్స్(RR), ఢిల్లీ క్యాపిటల్స్(DC), పంజాబ్ కింగ్స్(PBSK), కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఫ్రాంచైజీలకు ఆడాడు. క‌రుణ్‌ అనుభవాన్ని లక్నో జట్టు సద్వినియోగం చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా తాను ఫైనల్‌లో ఆడబోనని రాహుల్ శుక్రవారం ప్రకటించాడు. జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Updated On 6 May 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story