ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023(IPL 2023)లో ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) తన రెండో మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ జట్టు తమ రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం ఇది మూడోసారి. ఈసారి పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు విభిన్న శైలిలో కనిపిస్తోంది. కెప్టెన్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) సారథ్యంలోని ఈ జట్టు రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో కూడా రెండో స్థానానికి ఎగ‌బాకింది.

గత సీజన్‌లో 6వ ర్యాంక్‌తో స‌రిపెట్టుకున్న‌ పంజాబ్ కింగ్స్ జట్టు.. కెప్టెన్‌ని మార్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఎక్కువ మంది కెప్టెన్ల‌ను మార్చిన జ‌ట్టుగా పంజాబ్ పేరిట ఓ రికార్డ్ ఉంది. అయినా.. సార‌ధిగా ఉన్న‌ మ‌యాంక్ అగ‌ర్వాల్(Mayank Agarwal) ను వ‌దులుకుని ఈసారి కెప్టెన్సీ ప‌గ్గాలను శిఖర్ ధావన్ చేతిలో పెట్టింది. అయితే.. మార్పు మంచిదే అన్న‌ట్టు.. బుధవారం వరకు ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి.. 4 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తర్వాత రెండవ స్థానంలో ఉంది. కగిసో రబడ, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్‌ ఆటగాళ్లు ఆడక‌పోయినా.. పంజాబ్ విజ‌యాలు న‌మోదు చేస్తుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతుంది. ధావన్ తో పంజాబ్ ద‌శ తిరుగుతుంద‌ని అభిమానులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

రాజస్థాన్ జట్టు రెండో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ ఓట‌మితో నెట్ రన్‌రేట్ డ్రాప్ అయ్యింది. అంతకుముందు రాజస్థాన్ అత్యుత్తమ నెట్ రన్ రేట్ 3.600 కాగా.. ఓట‌మి త‌ర్వాత‌ 1.675కి పడిపోయింది. చివరి ఓవర్‌లో 5 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజ‌స్థాన్‌ రాయల్స్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు.. గత సీజన్‌లో చాంపియన్‌గా నిలిచి, ఈ సీజన్‌లో టైటిల్‌ను కాపాడుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ గుజరాత్ టైటాన్స్ జట్టు.. సీజ‌న్‌ను మంచి విజ‌యంతో ప్రారంభించింది. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు గెలిచి.. 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

గుజరాత్, పంజాబ్ జట్లు ఆడిన రెండు తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోగా, రెండూ ఒక్కో విజయం సాధించాయి. ఆర్సీబీ ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడి గెలిచింది. కేకేఆర్‌, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తమ మొదటి మ్యాచ్‌ను ఓడిపోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్‌లలో ఓడి చివ‌రి స్థానంలో ఉంది.

Updated On 5 April 2023 11:43 PM GMT
Ehatv

Ehatv

Next Story