రేపటి నుంచి సాయంత్రాలు టీవీల ముందు అతుక్కుపోయేవారు ఎక్కువగా కనిపిస్తారు. ఆడవారు అలిగినా సరే...ఇంట్లో టీవీ సీరియల్స్(Tv Serials)కు కాసేపు విరామం లభించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఐపీఎల్ సీజన్(IPL season) ప్రారంభమవుతున్నది కాబట్టి. ఇప్పటికే 15 సీజన్లు పూర్తి చేసుకున్నప్పటికీ ఐపీఎల్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తుంటుంది.

అహ్మదాబాద్(Ahmedabad)లోని నరేంద్రమోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో ఆరంభ వేడుకలకు ఏర్పాట్లు జరిగాయి. ఇందులో నటి తమన్నా డాన్స్(Tamanna Dance) ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నది. కరోనా వైరస్(Corona Virus) కారణంగా గత మూడు సీజన్‌లు పలు ఆంక్షల మధ్య జరిగాయి. ఈసారి మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూద్దామా అని ఆరాటపడుతున్నారు. శుక్రవారం జరిగే తొలి మ్యాచే రసవత్తరంగా ఉండబోతున్నది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్(GT), నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK)మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్ మొదలవుతుంది. మొత్తం పది జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. 12 నగరాలు ఐపీఎల్‌కు మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్నాయి. ఫైనల్‌తో కలిపి మొత్తం 74 మ్యాచ్‌లు జరగుతాయి. లీగ్ దశలో 70 మ్యాచ్‌లు, ప్లే ఆఫ్ దశలో నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. రాజస్తాన్ రాయల్స్ జట్టు జైపూర్‌తో పాటు గౌహతిలో, పంజాబ్ కింగ్స్ జట్టు మొహాలీతో పాటు ధర్మశాలలో కూడా మ్యాచ్‌లు ఆడతాయి. ప్లే ఆఫ్‌లో క్వాలిఫయర్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్‌ల తేదీలను, వేదికలను తర్వాత ప్రకటిస్తారు. మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా తర్వాత అనౌన్స్ చేస్తారు.