సాయంత్రాలు రిలాక్స్‌ మూడ్‌లో టీవీల ముందు అతుక్కుపోయే రోజులు మళ్లీ వచ్చేశాయి. చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఐపీఎల్‌(IPL) మెగా టోర్నీ ఇవాళ సాయంత్రం ఆరంభం కాబోతున్నది. అప్పుడే క్రికెట్‌ ఫ్యాన్స్‌ రెడీ అవుతున్నారు. ఈసారి ఐపీఎల్‌ ట్రోఫీ(IPL Trophy)ని ఎవరు అందుకోబోతున్నారు? ఇప్పటి వరకు అందుకోని ఐపీఎల్‌ ట్రోఫీని ఈసారైనా విరాట్‌ కోహ్లీ(Virat Kohli)అందుకుంటాడా?

సాయంత్రాలు రిలాక్స్‌ మూడ్‌లో టీవీల ముందు అతుక్కుపోయే రోజులు మళ్లీ వచ్చేశాయి. చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఐపీఎల్‌(IPL) మెగా టోర్నీ ఇవాళ సాయంత్రం ఆరంభం కాబోతున్నది. అప్పుడే క్రికెట్‌ ఫ్యాన్స్‌ రెడీ అవుతున్నారు. ఈసారి ఐపీఎల్‌ ట్రోఫీ(IPL Trophy)ని ఎవరు అందుకోబోతున్నారు? ఇప్పటి వరకు అందుకోని ఐపీఎల్‌ ట్రోఫీని ఈసారైనా విరాట్‌ కోహ్లీ(Virat Kohli)అందుకుంటాడా? లాస్ట్‌టైమ్‌ చివరి స్థానంలో నిలిచిన ముంబాయి(Mumabi) మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందా? అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబాయికి రోహిత్‌ శర్మ(Rohit Sharma) ఆరోసారి టైటిల్‌ను అందిస్తాడా? గుజరాత్‌(Gujarat) జట్టు ఈసారి ఎలా ఆడబోతున్నది? ఢిల్లీ, పంజాబ్‌లు టైటిల్‌ లేని లోటును తీర్చుకోగలవా? మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి ఇదే చివరి ఐపీఎల్‌ కానుందా? ఇంకా చాలా చాలా ప్రశ్నలు క్రికెట్‌ ఫ్యాన్స్‌ మదిలో మెదులుతున్నాయి. వీటన్నింటికీ ఐపీఎల్‌ టోర్నమెంట్‌ సమాధానం చెప్పబోతున్నది. ఈ సమ్మర్‌లో ఇంతకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ మరోటి ఉండదు. అసలు వరల్డ్‌లోనే అతి పెద్ద క్రికెట్‌ సంబరం ఇదేనంటే అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 15 ఐపీఎల్‌ టోర్నమెంట్లలో ఆ రకమైన జోష్‌ను మనం చూశాం కాబట్టి.

ఇవాళ అహ్మదాబాద్‌(Ahmedabad)లో జరిగే రసవత్తరమైన పోరుతో ఐపీఎల్‌కు అంకురార్పణ పడనుంది. గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌(GT Vs CSK) మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌ మొదలవుతుంది. అంతకు ముందు అదరగొట్టే విధంగా ఆరంభ వేడుకలు జరుగుతాయి. ఐపీఎల్‌లో చివరిసారిగా 2018లో ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. పుల్వామాలో దాడి కారణంగా 2019లో నిర్వాహకులు వేడుకలు రద్దు చేశారు. ఈసారి ఆటతో పాటు తొలిరోజు పాట, నృత్యాల సంబరం కూడా ఉంది. ప్రముఖ గాయకుడు అరిజిత్‌ సింగ్‌ పాటతో పాటు కత్రినా కైఫ్, టైగర్‌ ష్రాఫ్, రష్మిక మంధాన, తమన్నా డ్యాన్స్‌లతో అలరిస్తారు.

ఈసారి ఐపీఎల్‌ సీజన్‌ల మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. మే 28న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. లీగ్‌ దశలో ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే పది జట్లు ఉండటంతో లాస్టియర్‌లాగే కాస్త భిన్నమైన ఫార్మాట్‌ను అమలు చేస్తున్నారు. పది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ జట్టులో తమ గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్‌ చొప్పున... మరో గ్రూప్‌లోనే ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌ ‘ఎ’ లో ముంబాయి, కోల్‌కతా, రాజస్తాన్, ఢిల్లీ, లక్నో ఉన్నాయి. అంటే, ముంబాయి టీమ్‌ తమ గ్రూపులోనే ఉన్న కోల్‌కతా, రాజస్థాన్‌, ఢిల్లీ, లక్నోలతో ఒక్కో మ్యాచే ఆడుతుంది. గ్రూప్‌ 'బి'లో ఉన్న చెన్నై, బెంగళూరు, గుజరాత్‌, పంజాబ్‌, హైదరాబాద్‌ జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఎలా ఆడినప్పటికీ ప్రతి జట్టుకు సొంత గడ్డపై ఏడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుంది.

కరోనా కారణంగా మూడేళ్లుగా ఐపీఎల్‌ టోర్నీ పూర్తిస్థాయిలో జరగలేదు. ఇందుకు అభిమానులు కాస్త నిరాశపడిన మాట వాస్తవమే. 2019 తర్వాత అన్ని జట్లకూ తమ తమ సొంత గడ్డపై మ్యాచ్‌లు ఆడే అవకాశం ఈసారి లభించబోతున్నది. మొత్తం పది జట్లు టైటిల్‌ కోసం పోటీపడుతున్నాయి. నిబంధనల్లో చిన్నపాటి మార్పులతో 16వ సీజన్‌ లీగ్‌ సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివిధ జట్లలో ఆటగాళ్లు కూడా అటుఇటు అయ్యారు. కొత్త ఆటగాళ్లు వచ్చారు. పాతకాపులు కొందరికి అవకాశం దక్కలేదు. ఇక దక్షిణాఫ్రికా, శ్రీలంకకు చెందిన ప్లేయర్స్‌ కాస్త ఆలస్యంగా తమ ఐపీఎల్‌ టీమ్‌లతో చేరతారు. ప్రస్తుతం ఆ జట్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌తో బిజీగా ఉన్నాయి. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ పేరుతో కొత్త రూల్‌ను తీసుకువచ్చారు. దీని ప్రకారం ముందుగా ప్రకటించిన నలుగురు సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లలో ఒకరిని మ్యాచ్‌ మధ్యలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా మైదానంలో దింపవచ్చు. సపోజ్‌ బ్యాటింగ్‌ ఒకరు చేశారనుకోండి. తర్వాత ప్రత్యర్థి జట్టు బరిలో దిగినప్పుడు అతడి స్థానంలో బౌలర్‌ను తీసుకోవచ్చు. అంటే పరిస్థితులను బట్టి ప్లేయర్లను మార్చుకోవచ్చన్నమాట. అలాగే టాస్‌ వేసిన తర్వాత కూడా ఫైనల్‌ టీమ్‌ను ప్రకటించుకోవచ్చు. సౌతాఫ్రికా టీ-20 లీగ్‌లో ఈ రూల్‌ను ఇంప్లిమెంట్‌ చేశారు. టాస్‌ గెలిస్తే ఓ రకమైన టీమ్‌తో, టాస్‌ ఓడితో మరో రకమైన టీమ్‌తో రెడీ అయ్యి కెప్టెన్‌ టాస్‌కు వెళ్లవచ్చు. ఇంకో మార్పు ఏమిటంటే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తరహాలో వైడ్‌లు, నోబాల్స్‌ కోసం కూడా డీఆర్‌ఎస్‌ను వాడుకోవచ్చు.

Updated On 31 March 2023 12:42 AM GMT
Ehatv

Ehatv

Next Story