ఐపీఎల్-2023 సీజన్(IPL 2023 Season16)ను డిఫెడింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) గొప్పగా ఆరంభించింది. సీజన్ తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)పై అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ కావడంతో గుజరాత్‌కు కాస్త అడ్వాంటేజ్ అయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
ఐపీఎల్-2023 సీజన్(IPL 2023 Season16)ను డిఫెడింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) గొప్పగా ఆరంభించింది. సీజన్ తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)పై అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ కావడంతో గుజరాత్‌కు కాస్త అడ్వాంటేజ్ అయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేయడం ఆటలోని ముఖ్య విశేషం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్‌ఖాన్ 26 పరుగులకు రెండు వికెట్లు తీసుకోగా, షమీ 29 పరుగులకు రెండు వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బరిలో దిగిన గుజరాత్ జట్టు 19.2 ఓవర్లలో అయిదు వికెట్లకు 182 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. శుభ్‌మన్ గిల్ 36 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 63 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర వహించాడు. చెన్నై జట్టులో ఒక్క రుతురాజ్ తప్ప మిగతావారు పెద్దగా రాణించలేదు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కోల్‌కతాతో తలపడుతుంది. రాత్రి ఏడున్నర నుంచి మొదలయ్యే మ్యాచ్‌లో లక్నో జట్టు ఢిల్లీతో పోరు సలుపుతుంది.
స్కోరు బోర్డు(Score Board)
చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)
కాన్వే (బి) షమీ 1; రుతురాజ్ (సి) గిల్ (బి) జోసెఫ్ 92; మొయిన్ అలీ (సి) సాహా (బి) రషీద్ 23; స్టోక్స్ (సి) సాహా (బి) రషీద్ 7; రాయుడు (బి) లిటిల్ 12; దూబే (సి) రషీద్ (బి) షమీ 19; జడేజా (సి) శంకర్ (బి) జోసెఫ్ 1; ధోని (నాటౌట్) 14; సాన్‌ట్నర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 178. వికెట్ల పతనం: 1–14, 2–50, 3–70, 4–121, 5–151, 6–153, 7–163.
బౌలింగ్: షమీ 4–0–29–2, పాండ్యా 3–0–28–0, లిటిల్ 4–0–41–1, రషీద్ 4–0–26–2, జోసెఫ్ 4–0–33–2, యష్ 1–0–14–0.
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)
సాహా (సి) దూబే (బి) రాజ్‌వర్ధన్ 25; గిల్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 63; సుదర్శన్ (సి) ధోని (బి) రాజ్‌వర్ధన్ 22; పాండ్యా (బి) జడేజా 8; విజయ్‌శంకర్ (సి) సాన్‌ట్నర్ (బి) రాజ్‌వర్ధన్ 27; రాహుల్ తెవాటియా (నాటౌట్) 15; రషీద్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–37, 2–90, 3–111, 4–138, 5–156.
బౌలింగ్: దీపక్ చహర్ 4–0–29–0, తుషార్ దేశ్‌పాండే 3.2–0–51–1, రాజ్‌వర్ధన్ 4–0–36–3, సాన్‌ట్నర్ 4–0–32–0, జడేజా 4–0–28–1.