ఐపీఎల్ 2023(IPL 2023)లో 18వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య జరగనుంది. ఇరు జట్లూ తమ చివరి మ్యాచ్‌లో ఓటమి చవిచూశాయి. ఈ పరిస్థితుల్లో రెండు జట్లూ విజయం సాధించాలని చూస్తున్నాయి. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్.. కోల్‌కతా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేకేఆర్(KKR)కు చెందిన రింకూ సింగ్(Rinku Singh).. చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ఎలా గెలిపించాడో ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్ తమ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్(Sunrisers) చేతిలో ఓటమి చెందింది.

Punjab Kings vs Gujarat Titans
ఐపీఎల్ 2023(IPL 2023)లో 18వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య జరగనుంది. ఇరు జట్లూ తమ చివరి మ్యాచ్‌లో ఓటమి చవిచూశాయి. ఈ పరిస్థితుల్లో రెండు జట్లూ విజయం సాధించాలని చూస్తున్నాయి. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్.. కోల్‌కతా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేకేఆర్(KKR)కు చెందిన రింకూ సింగ్(Rinku Singh).. చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ఎలా గెలిపించాడో ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్ తమ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్(Sunrisers) చేతిలో ఓటమి చెందింది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ మొహాలీ(Mohali)లో జరగనుంది.
మొహాలీలో పిచ్ గురించి మాట్లాడితే.. ఫాస్ట్ బౌలర్లు ఈ వికెట్ నుండి మంచి బౌన్స్ పొందవచ్చు. అయితే ఈ పిచ్ గతంలో కంటే ఇప్పుడు కాస్త నెమ్మదించి బ్యాటింగ్ చేయడానికి మంచి వికెట్‌గా మారింది. ఈ గ్రౌండ్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లలో 180కి పైగా స్కోర్లు చేసినా చేజింగ్ చేయబడింది. ఈ నేపథ్యంలో రెండు ఇన్నింగ్స్‌లలో జట్లు ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. మొహాలీలో ఇప్పటి వరకు మొత్తం 9 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లలో మొదట 5 సార్లు బ్యాటింగ్ చేసిన జట్టు.. 4 సార్లు చేజింగ్ చేసిన జట్టు విజయం సాధించాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో టాస్‌కు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. హోరాహోరి పోరు ఉండే అవకాశాలు ఎక్కువ.
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 7.30 గంటలకు లైవ్ యాక్షన్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆస్వాదించవచ్చు. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో జియో సినిమా ద్వారా.. 12 భాషలలో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు.
