మహిళల టీ-20లో(Women T20) పెను సంచలనం నమోదయ్యింది. మంగోలియాతో(Mangolia) జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా(Indonesia) బౌలర్‌ రొహ్మాలియా(Rohmalia) పరుగులేమీ ఇవ్వకుండానే ఏడు వికెట్లు తీసుకుంది. ఇంటర్నేషనల్‌ టీ-20లలో అది మెన్స్ కానీ, వుమెన్స్‌ కానీ ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ టీమ్‌ తరఫున ఇలాంటి స్టాటిస్టిక్స్‌ నమోదు కాలేదు.

మహిళల టీ-20లో(Women T20) పెను సంచలనం నమోదయ్యింది. మంగోలియాతో(Mangolia) జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా(Indonesia) బౌలర్‌ రొహ్మాలియా(Rohmalia) పరుగులేమీ ఇవ్వకుండానే ఏడు వికెట్లు తీసుకుంది. ఇంటర్నేషనల్‌ టీ-20లలో అది మెన్స్ కానీ, వుమెన్స్‌ కానీ ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ టీమ్‌ తరఫున ఇలాంటి స్టాటిస్టిక్స్‌ నమోదు కాలేదు. మెన్స్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకు బెస్ట్ బౌలింగ్‌ స్యాజ్రుల్‌ ఇద్రుస్‌ పేరిట ఉంది. ఇతడు నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్‌తో ఎనిమిది పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు. మహిళల క్రికెట్‌లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్‌కు చెందన ఫ్రెడ్రిక్‌ ఓవర్డిక్‌ పేరిట ఉండింది. ఈమె నాలుగు ఓవర్లలో రెండు మెయిడిన్లతో మూడు పరుగులిచ్చి ఏడు వికెట్లు తీసుకుంది. వలర్డ్‌ క్రికెట్‌లో ఇప్పటి వరకు పరుగులేమీ ఇవ్వకుండా ఏడు వికెట్లు తీసుకున్న బౌలర్‌ రొహ్మాలియా తప్ప మరొకరు లేరు. తన కెరీర్‌లోని రెండో టీ-20 మ్యాచ్‌లోనే ఆమె ఈ అనూహ్యమైన గణాంకాలను నమోదు చేసుకోవడం విశేషం. ఇండోనేషియాలో బాలీ బాష్‌ టోర్నమెంట్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లోనే రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండోనేషియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్‌లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్‌ 4 వికెట్లు పడగొట్టింది. 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా టీమ్‌లో ఆరుగురు డకౌట్‌ అయ్యారు.

Updated On 25 April 2024 6:57 AM GMT
Ehatv

Ehatv

Next Story