అనుకోలేదు ఇలా జరుగుతుందని...అనుకోలేదు టీం ఇండియాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని..అనుకోలేదు విరాట్, రోహిత్ లు ఇలా ఫ్లాప్ అవుతారని.

అనుకోలేదు ఇలా జరుగుతుందని...అనుకోలేదు టీం ఇండియాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని..అనుకోలేదు విరాట్, రోహిత్ లు ఇలా ఫ్లాప్ అవుతారని. మొత్తంగా స్వ‌దేశంలో వ‌రుస‌గా 18వ సిరీస్ గేల్చుకోలేకపోయింది ఇండియా. పుష్కర కాలంగా ట్రోఫీని వ‌ద‌ల‌ని టీమిండియా (Team India) తొలిసారి ఘోర ప‌రాజయాన్ని చవి చూసింది. వేల కొద్దీ ప‌రుగులు.. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన వారంతా చతికిల పడ్డారు. ఫ‌లితంగా… స్పిన్ పిచ్‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను దెబ్బ‌కొట్టే భార‌త జ‌ట్టు ఇప్పుడు అదే దెబ్బ తింది. రోహిత్ శ‌ర్మ బృందం 3-0తో సిరీస్ కోల్పోవ‌డం అభిమానుల‌కు మింగుడుప‌డ‌డం లేదు. ముంబైలో 25 ప‌రుగుల ఓట‌మితో వైట్‌వాష్‌కు గురైన టీమిండియాకు ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ (WTC 2023-25) పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానం చేజారింది.బంగ్లాదేశ్‌పై 2-0తో టెస్టు సిరీస్ గెలుపొందిన టీమిండియా నెల రోజుల్లోనే ఇంతటి దయనీయమైన పరిస్థితి రావడం విచిత్రం. శ్రీ‌లంక చేతిలో చావుదెబ్బ తినొచ్చిన న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి సిరీస్ ను పళ్ళెం లో పెట్టి ఇచ్చింది.. వ‌రుస‌గా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైన‌ల్ చేరాల‌నుకున్న భార‌త జ‌ట్టుకు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. డబ్ల్యూటీసీ రాంకింగ్స్‌లో టీమిండియా 58.33 పాయింట్ల‌తో రెండో స్థానానికి ప‌డిపోయింది. ఆస్ట్రేలియా టాప్ లో నిలిచింది..శ్రీ‌లంక 55.56 పాయింట్ల‌తో మూడో, న్యూజిలాండ్ 54.55 పాయింట్ల‌తో నాలుగో ర్యాంకులో కొన‌సాగుతున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రోహిత్ సేన టెస్టు గ‌ద పోరుకు అర్హ‌త సాధించాలంటే ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో 5-0తో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీని ద‌క్కించుకోవాలి. అప్పటికీ ఫైన‌ల్ అవకాశం కోసం శ్రీ‌లంక‌, కివీస్, ద‌క్షిణాఫ్రికా ఫ‌లితాలపై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది.

Updated On 3 Nov 2024 10:37 AM GMT
ehatv

ehatv

Next Story