గతేడాది డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయాలపాలైన 25 ఏళ్ల పంత్.. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. సోమవారం సడెన్‌గా రిషబ్ తన సహచరులను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆలూరులోకి క్యాంప్ మైదానానికి చేరుకున్న పంత్.. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో(Rahul Dravid) చాలా సేపు మాట్లాడాడు. సహచరుడు కుల్దీప్ యాదవ్‌తో(Kuldeep Yadav) సరదాగా కనిపించాడు. ఇతర ఆటగాళ్లను కూడా కలిశాడు. మంగళవారం ఉదయం బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది.
ఆలూరులో(alure) ఆసియా కప్‌కు(Asia cup) సిద్ధమవుతున్న టీమిండియా(Team India) ఆటగాళ్లను భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(Rishabh Pant) కలుసుకున్నాడు. బెంగళూరు సమీపంలోని ఆలూరులో భారత జట్టు ప్రాక్టీస్ క్యాంపులో(Training Camp) ఉంది. ఇక్కడ టీమిండియా ఆసియా కప్ సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో(Pakistan) తలపడనుంది.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన కారు ప్రమాదంలో గాయాలపాలైన 25 ఏళ్ల పంత్.. ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. సోమవారం సడెన్‌గా రిషబ్ తన సహచరులను కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆలూరులోకి క్యాంప్ మైదానానికి చేరుకున్న పంత్.. టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో(Rahul Dravid) చాలా సేపు మాట్లాడాడు. సహచరుడు కుల్దీప్ యాదవ్‌తో(Kuldeep Yadav) సరదాగా కనిపించాడు. ఇతర ఆటగాళ్లను కూడా కలిశాడు. మంగళవారం ఉదయం బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది.
రిషబ్ పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ పునరావాసంలో ఉన్నాడు. పంత్ ఇటీవల క్రికెట్ పిచ్ మీద అడుగుపెట్టాడు. స్థానిక టోర్నమెంట్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. కారు ప్రమాదం తర్వాత పంత్ తొలిసారి బ్యాటింగ్ చేశాడు. అయితే.. వచ్చే ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ నుంచి అతడు ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి వస్తాడని విశ్వసిస్తున్నారు.
ఐర్లాండ్‌లో టీ20 సిరీస్ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ కూడా జట్టులో చేరారు. ప్రాక్టీస్ క్యాంపులో బుమ్రా భీకరంగా బౌలింగ్ చేశాడు. ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లు యో-యో టెస్టులో కూడా కూడా పాల్గొన్నారు. యో-యో టెస్టులో చాలా మంది ఆటగాళ్లు 16.5 నుండి 18 రేంజ్‌లో స్కోర్ చేశారు. యో-యో టెస్ట్ ఫలితాలను కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. దీంతో బీసీసీఐ కూడా అతడిని మందలించింది. మీడియా కథనాల ప్రకారం.. యో-యో టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచాడు.