భారత జట్టు ప్రధాన బౌలర్ బూమ్రా(Jasprit Bumhra) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలే ఇప్పుడు భీకర ఫాంలో కొనసాగుతున్నాడు. బుమ్రా బౌంతిని ఎదుర్కోలేక ఇంగ్లాండ బ్యాటర్లు భయపడుతున్నారు. భారత పిచ్‌ల మీద రెచ్చిపోయి బౌలింగ్ చేస్తుండడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ విలవిలాడుతున్నారు. స్పిన్, ఫ్లాట్‌గా ఉండే ట్రాక్‌లపై బూమ్రా ఇంతలా రెచ్చిపోతే పేస్ పిచ్‌లపై ఇంకెలా బౌలింగ్ చేస్తాడోనని భయపడిపోతున్నాడు.
భారత జట్టు ప్రధాన బౌలర్ బూమ్రా(Jasprit Bumrah) గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలే ఇప్పుడు భీకర ఫాంలో కొనసాగుతున్నాడు. బుమ్రా బౌంతిని ఎదుర్కోలేక ఇంగ్లాండ బ్యాటర్లు భయపడుతున్నారు. భారత పిచ్‌ల మీద రెచ్చిపోయి బౌలింగ్ చేస్తుండడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ విలవిలాడుతున్నారు. స్పిన్, ఫ్లాట్‌గా ఉండే ట్రాక్‌లపై బూమ్రా ఇంతలా రెచ్చిపోతే పేస్ పిచ్‌లపై ఇంకెలా బౌలింగ్ చేస్తాడోనని భయపడిపోతున్నాడు. ఈ క్రమంలోనే కెరీర్‌కు కాస్త విరామం ఇచ్చి తమ చిన్నారి కుమారుడు అంగద్‌తో సంతోషంగా సమయం గడుపుతున్నారు.
బుమ్రా- సంజనాలది(Sanjana) ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాలంటైన్స్ డే(Valentine's Day) సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ యాడ్‌లో నటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బుమ్రా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ క్రమంలోనే కొందరు బుమ్రా భార్యను ట్రోల్ చేశారు. 'వదినమ్మ.. రోజు రోజుకీ లావైపోతోంద' ఓ(Body shaming) నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి సంజన కూడా చెప్పుతో కొట్టినట్లే సమాధానం చెప్పింది. అలా మాట్లాడటానికి సిగ్గుండాలంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూళ్లో సైన్స్ పుస్తకాంలో చదువుకున్న పాఠాలు గుర్తుండవు కానీ.. మహిళల శరీరాల గురించి మాట్లాడేందుకు ముందుకు వస్తారని ఆమె మండిపడింది. అసలు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ అతనికి సంజనా వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంపై సంజనాకు పలువురు మద్దతుగా నిలిచారు. ట్రోలర్స్‌కు సంజనా సరైన కౌంటర్ ఇచ్చిందని.. ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు. సెలబ్రిటీలు అయినంత మాత్రాన వారి మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసే హక్కు ఉందనుకోవడం సరికాదని కొందరు నెటిజన్లు హితవు పలికారు.