వన్డే ప్రపంచకప్‌(ODI World Cup)లో ఇవాళ అత్యంత కీలక సమరం జరగబోతున్నది. భారత క్రికెట్ అభిమానులు రెప్పవాల్చకుండా చూడబోయే ఆ మ్యాచ్‌కు ముంబాయి(Mumbai)లోని వాంఖడే స్టేడియం వేదిక కాబోతున్నది. ఫైనల్‌కు అడుగు దూరంలో ఉన్న మ్యాచ్‌ కావడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

వన్డే ప్రపంచకప్‌(ODI World Cup)లో ఇవాళ అత్యంత కీలక సమరం జరగబోతున్నది. భారత క్రికెట్ అభిమానులు రెప్పవాల్చకుండా చూడబోయే ఆ మ్యాచ్‌కు ముంబాయి(Mumbai)లోని వాంఖడే స్టేడియం వేదిక కాబోతున్నది. ఫైనల్‌కు అడుగు దూరంలో ఉన్న మ్యాచ్‌ కావడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తొలి సెమీ ఫైనల్‌ పోరులో ఇండియా-న్యూజిలాండ్‌ తలపడనున్నాయన్న విషయాన్ని చెప్పాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్‌లో టాస్‌ కీలకం కాబోతున్నది. వాంఖడే పిచ్‌ మొదట బ్యాటింగ్‌ చేసే జట్టుకు పూర్తిగా సహకరించనుందట! అందుకే టాస్‌ గెలిచే జట్టు ఏ మాత్రం ఆలోచన చేయకుండా బ్యాటింగ్‌నే ఎంచుకుంటుంది. ఈ పిచ్‌పై పరుగులు మొదట బ్యాటింగ్‌ చేసే జట్టు పరుగుల వరదను పారించే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఇండియా- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌ ఇందుకు ఉదాహరణ. పాపం టాస్‌ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్‌ చేయకుండా ఆ అవకాశాన్ని ఇండియాకు ఇచ్చింది. ఆ పొరపాటుకు ఫలితాన్ని అనుభవించింది. 302 పరుగుల తేడాతో దారుణమైన పరాజయాన్ని చవి చూసింది. అందేరూ ఇరు జట్లు టాస్‌ గెలిస్తే తప్పక బ్యాటింగ్‌ ఎంచుకుంటాయి. ఇక ఈ స్టేడియంలోని బౌండరీ చిన్నది కావడంతో ఫోర్లు, సిక్సర్లు ఈజీగా వస్తాయి. ఈ పిచ్‌ తొలుత బ్యాటింగ్‌కు ఎంతగా సహకరిస్తుందో, సెకెండాఫ్‌లో పేస్‌ బౌలింగ్‌కు అంతే అడ్వాంటేజ్‌గా ఉంటుంది. ఈ లెక్కన టాస్‌ గెలిచిన జట్టు సగం మ్యాచ్‌ గెలిచినట్టే!

Updated On 15 Nov 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story