కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత్ ముందు 133 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. దీంతో ఓపెనర్ 133 పరుగుల లక్ష్య చేధనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఊచకోత కోశాడు. అతడిని ఆపడం ఇంగ్లండ్ బౌలర్ల వల్ల కాలేదు. కేవలం 20 బాల్స్‌కే హాఫ్ సెంచరీ బాదేశాడు అభిషేక్ శర్మ. ఓవరాల్‌గా 34 బంతుల్లు ఎదుర్కొన్న ఈ పంజాబీ బ్యాటర్ 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో వరుణ్‌​ చక్రవర్తి మూడు వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్‌, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్‌(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు అనుకున్నంతగా రాణించలేకపోయారు. ఇక 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్‌ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవర్లలలోనే చేధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్‌​ శర్మతో పాటు సంజూ శాంసన్‌(26), తిలక్‌ వర్మ(19 నాటౌట్‌) కూడా రెచ్చిపోయి ఆడడంతో సునాయస విజయం భారత్‌ సొంతమైంది.

ehatv

ehatv

Next Story