బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. స్టీవెన్ స్మిత్ సెంచరీతో చెలరేగాడు. 140 పరుగులు చేశాడు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అద్భుత సహకారాన్ని అందించాడు. ఒకవైపు స్టీవెన్ స్మిత్.. మరో ఎండ్‌లో పాట్ కమ్మిన్స్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆరంభంలో తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ అత్యల్ప స్కోర్ 3 పరుగులే చేశాడు. కోహ్లీ 36 పరుగులతో మమ అనిపించాడు. రిషబ్ పంత్-28, రవీంద్ర జడేజా-17 పరుగులు చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. దీంతో మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును నితీష్‌కుమార్‌రెడ్డి ఆదుకున్నాడు. సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత జట్టు పరువును నిలబెట్టాడు. అర్ధసెంచరీ చేసి బ్యాట్‌తో అల్లు అర్జున్‌ను ఇమిటేట్‌ చేశాడు. మరోవైపు వాషింగ్టన్‌ సుందర్ కూడా 50 పరుగులు చేసి నితీష్‌కుమార్‌రెడ్డికి అద్భుతమైన సహకరాన్ని అందించాడు.

ehatv

ehatv

Next Story