ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసింది. తొలి సెషన్ ఆసీస్ ను ఆలౌట్ చేయడంలో విఫలం అయిన భారత్.. చివరి సెషన్ ఆఖరి ఓవర్లలో వెంట వెంటనే వికెట్లను కోల్పోయి 310 పరుగులతో వెనుకబడి ఉంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 46 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (82 పరుగులు 11 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. విరాట్ కోహ్లీ (34 పరుగులు 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (24 పరుగులు 3 ఫోర్లు) చేశారు. ప్రస్తుతం పంత్ (6 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బొలాండ్ చెరో రెండు వికెట్లు సాధించారు. ప్రస్తుతం భారత్ 310 పరుగులు వెనుకబడి ఉంది. అంతకు లంచ్ తర్వాత ఆస్ట్రేలియా ఆలౌట్ కావడంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే రోహిత్ శర్మ (3) వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ క్లాస్ ను ప్రదర్శించాడు. అయితే రెండో సెషన్ చివరి బంతికి రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.