కేప్‌టౌన్‌లో (CapeTown) సౌతాఫ్రికాతో (South Africa) జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్‌ (Bharath) ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ చారిత్రాత్మక గెలుపుతో వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. 54.16 శాతం పాయింట్లతో భారత జట్టు.. ఐదో స్ధానం నుంచి ఫస్ట్‌ ప్లేస్‌కు దూసుకెళ్లింది.

కేప్‌టౌన్‌లో (CapeTown) సౌతాఫ్రికాతో (South Africa) జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్‌ (Bharath) ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ చారిత్రాత్మక గెలుపుతో వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. 54.16 శాతం పాయింట్లతో భారత జట్టు.. ఐదో స్ధానం నుంచి ఫస్ట్‌ ప్లేస్‌కు దూసుకెళ్లింది. 50 శాతం పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్ధానానికి పడిపోయింది. ఇక సౌతాఫ్రికా తర్వాత న్యూజిలాండ్‌(50.0), ఆస్ట్రేలియా(50.0), బంగ్లాదేశ్‌(50.0) పాకిస్తాన్‌(45.83) కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ మూడో టెస్టు పూర్తయిన తర్వాత డబ్ల్యూటీసీ ర్యాంకుల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా (Australia) గెలిస్తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరే చాన్స్ ఉంది.

Updated On 4 Jan 2024 10:16 PM GMT
Ehatv

Ehatv

Next Story