ఇండియా(India)-పాకిస్తాన్‌(Pakistan) మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే చాలు ఫ్యాన్స్‌ ఎగబడిపోతారు. అది టెస్ట్ అవ్వనివ్వండి, వన్డే అవ్వనివ్వండి, ఈ-20 అవ్వనివ్వండి..ఎలాంటి పోరు అయినా సరే స్టేడియం కిటకిటలాడాల్సిందే. ఇక వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ అయితే చెప్పనే అక్కర్లేదు. రెండు జట్లు ఎప్పుడు పోటీపడతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు రెండు దేశాల అభిమానులు. జూన్‌ 9వ తేదీన ఈ రెండు జట్లు మరోసారి తలపడబోతున్నాయి.

ఇండియా(India)-పాకిస్తాన్‌(Pakistan) మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే చాలు ఫ్యాన్స్‌ ఎగబడిపోతారు. అది టెస్ట్ అవ్వనివ్వండి, వన్డే అవ్వనివ్వండి, ఈ-20 అవ్వనివ్వండి..ఎలాంటి పోరు అయినా సరే స్టేడియం కిటకిటలాడాల్సిందే. ఇక వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ అయితే చెప్పనే అక్కర్లేదు. రెండు జట్లు ఎప్పుడు పోటీపడతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు రెండు దేశాల అభిమానులు. జూన్‌ 9వ తేదీన ఈ రెండు జట్లు మరోసారి తలపడబోతున్నాయి. టీ 20 వరల్డ్‌కప్‌-2024లో(T-20 worldcup) భాగంగా జూన్ 9న అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే ఈ మ్యాచ్‌ టికెట్ల కోసం అప్పుడే కొట్టుకుంటున్నారు. ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ మామూలుగా ఉండదు కాబట్టే టికెట్ల రేట్లు కూడా భారీగా పెరిగాయి. ఒక్కో టికెట్‌ అత్యధికంగా 1.8 కోట్ల రూపాయలు పలుకుతోంది. పైసలా చిల్లపెంకులా అన్న డౌట్‌ వచ్చింది కదూ! టీ20 వరల్డ్‌కప్‌ టిక్కెట్లను ఐసీసీ ప‌బ్లిక్ బ్యాల‌ట్ ద్వారా అమ్ముతోంది. ఈ క్రమంలో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌కు టికెట్ల‌ ధ‌రను ఆరు డాల‌ర్ల‌ నుంచి 400 డాల‌ర్లుగా నిర్ణ‌యించింది. మన కరెన్సీలో చెప్పుకుంటే మినిమమ్‌ 497 రూపాయలు ఉంటే, మాగ్జిమమ్‌ రేటు 33,148 రూపాయలు ఉంది. ఇండియా-పాక్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను స్టబ్‌హబ్‌, సీట్‌గీక్‌ వంటి ఆన్‌లైట్‌ ప్లాట్‌ఫారమ్స్‌ క్యాష్‌గా మార్చుకుంటున్నాయి. 400 డాలర్లు ఉన్న టికెట్‌ రేటు సెకండరీ మార్కెట్‌లో 40 వేల డాలర్లు పలుకుతున్నదట! టాక్స్‌ కూడా కలిపితే 50 వేల డాలర్లు అవుతుంది. అంటే మన లెక్కన ఇంచుమించు 40 లక్షల రూపాయలన్నమాట! ఇక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్ సీట్‌గీక్‌లో అయితే ఈ మ్యాచ్‌ టికెట్‌ రేట్లు ఊహకు అందనంతగా ఉన్నాయి. మాగ్జిమమ్‌ టికెట్ రేటు 1,75,000 డాలర్లు ఉందట! మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 1.4 కోట్ల రూపాయలు. అదనపు ఛార్జీలు, టాక్స్‌లు కలిపితే సుమారు 1.9 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది.

Updated On 4 March 2024 5:01 AM GMT
Ehatv

Ehatv

Next Story