క్రికెట్(Cricket) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ(ICC) వన్డే ప్రపంచ కప్(One day World Cup) టోర్నీకి సమయం దగ్గరపడింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ సమరంకోసం టీమిండియా సర్వ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ టీమ్‌కు అన్ని శుభశకునాలే ఎదురవుతున్నాయి.
క్రికెట్(Cricket) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ(ICC) వన్డే ప్రపంచ కప్(One day World Cup) టోర్నీకి సమయం దగ్గరపడింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్ సమరంకోసం టీమిండియా సర్వ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇండియన్ టీమ్‌కు అన్ని శుభశకునాలే ఎదురవుతున్నాయి. మొన్నటికి మొన్న ఆసియా కప్‌ను(Asia Cup) ఘనంగా గెల్చుకున్న భారత జట్టు నిన్నటికి నిన్న ఆస్ట్రేలియాను(Australia) ఓడించింది. ఇది కాకుండా లేటెస్ట్‌గా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ(ICC Rankings) అన్ని ఫార్మాట్లలో భారత్ అగ్రస్థానంలో నిలిచంది. వన్డేలలో భారత్ 116 పాయింట్లలో టాప్ ర్యాంక్‌ను సాధించింది. 115 పాయింట్లతో పాకిస్తాన్ రెండో ప్లేస్‌లో, 111 పాయింట్లతో ఆస్ట్రేలియా థర్డ్ ప్లేస్‌లో నిలిచాయి. ఆసీస్‌తో సిరీస్‌ను నెగ్గితే వరల్డ్ కప్‌నకు అగ్రస్థానంతో బరిలోకి దిగే అవకాశం భారత్‌కు ఉంటుంది. ఇప్పటికే ఇండియన్ టీమ్ టెస్ట్, టీ 20 ఫార్మాట్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. ఆసీస్‌తో బోర్డర్- గవాస్కర్ సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది భారత్. వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను గెల్చుకోవడంతో టెస్ట్‌ల్లో ఇండియా 118 పాయింట్లో మొదటిస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 115 పాయింట్లతో ఇంగ్లాండ్ మూడో స్థానంలో నిలిచింది. ఇలా మూడు ఫార్మాట్లలో భారత్ అగ్రస్థానం చేరుకోవడం ఇదే తొలిసారి. భారత్ కంటే ముందు 2012లో దక్షిణాఫ్రికా ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత్ ఆ జాబితాలో చేరింది.