టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. గత మూడు మ్యాచ్‌లు జరిగిన వేదికలతో

రాంచీ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ భారత జట్టులోకి వచ్చాడు. కోహ్లీ, రాహుల్‌, శ్రేయస్‌ వంటి ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు డబుల్‌ సెంచరీలతో 545 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియా ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. గత మూడు మ్యాచ్‌లు జరిగిన వేదికలతో పోల్చుకుంటే.. రాంచీ పిచ్‌ భిన్నంగా ఉండనుంది. స్పిన్‌కు సహకరించే అవకాశలెక్కువ. పిచ్‌పై పగుళ్లు ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ కాస్త కష్టమవచ్చు.

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(w), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(సి), బెన్ ఫోక్స్(w), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

Updated On 22 Feb 2024 10:35 PM GMT
Yagnik

Yagnik

Next Story