ఇండియాతో జరిగిన మొదటి మూడు టెస్ట్‌ల సంగతేమిటో కానీ, నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్‌లో మాత్రం ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోరును సాధించే దిశగా వెళుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.
ఇండియాతో జరిగిన మొదటి మూడు టెస్ట్‌ల సంగతేమిటో కానీ, నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్‌లో మాత్రం ఆస్ట్రేలియా గౌరవప్రదమైన స్కోరును సాధించే దిశగా వెళుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా 251 బంతుల్లో 15 బౌండరీలతో 104 పరుగులు చేయగా, కామెరూన్ గ్రీన్ 64 బంతుల్లో ఎనిమిది ఫోర్లతో 49 పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ (32; 44 బంతుల్లో 7 ఫోర్లు), లబుషేన్ (3), హ్యాండ్స్‌కాంబ్ (17; 27 బంతుల్లో 3 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (38; 135 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమి రెండు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
మొదట్లో ఆచితూచి ఆడిన ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తర్వాత దూకుడు పెంచాడు. అయితే ఓ చక్కటి బంతితో హెడ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు. కాసేపటికే లబుషేన్ ను షమీ క్లీన్ బౌల్డ్ చేశారు. లంచ్ టైమ్‌కు ఆసీస్ రెండు వికెట్లకు 75 పరుగులు చేసింది. టీ విరామం తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిన్‌ను రవీంద్ర జడేజా ఇంటిదారి పట్టించాడు. మూడో వికెట్‌కు ఖవాజాతో కలిసి స్మిత్ 79 పరుగులు జోడించాడు. అనంతరం బరిలో దిగిన పీటర్ హ్యాండ్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మొదటి రోజులో ఖవాజా సెచరీ చేయడం ఓ విశేషమైతే, లక్షమంది ప్రేక్షకులు మ్యాచ్‌ను తిలకించడానికి రావడం మరో విశేషం.