ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజ‌న్‌లో చాలా జట్లు గాయాల‌ సమస్యల‌తో సతమతమవుతున్నాయి. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్ప‌టికే ఈ స‌మ‌స్య‌తో జానీ బెయిర్‌స్టో దూర‌మ‌య్యాడు. ఆ తర్వాత భారత యువ ఆల్ రౌండర్ రాజ్ అంగద్ బావా కూడా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)16వ సీజ‌న్‌లో చాలా జట్లు గాయాల‌ సమస్యల‌తో సతమతమవుతున్నాయి. పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టుకు ఇప్ప‌టికే ఈ స‌మ‌స్య‌తో జానీ బెయిర్‌స్టో(Jonny Bairstow) దూర‌మ‌య్యాడు. ఆ తర్వాత భారత యువ ఆల్ రౌండర్ రాజ్ అంగద్ బావా (raj Anand) కూడా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. తాజాగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone) విష‌య‌మై టీమ్ మేనేజ్‌మెంట్ కు ఆందోళన పెరిగింది. గత రెండు మ్యాచ్‌లలో లివింగ్‌స్టోన్ ఆడ‌లేదు. వేలంలో ఫ్రాంచైజీ రూ. 11.50 కోట్లు వెచ్చించి లివింగ్‌స్టోన్(Livingstone) ను తీసుకుంది. వేలంలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాళ్ళలో లివింగ్‌స్టోన్ ఒకడు.

లియామ్ లివింగ్‌స్టోన్.. చీలమండ, మోకాలి సమస్యల కారణంగా డిసెంబర్ నుండి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్‌-2023 ప్రారంభానికి ముందు లివింగ్‌స్టోన్ ఫిట్‌నెస్ గురించి సమాచారం వెల్లడైంది, కానీ అతనికి మెడికల్ క్లియరెన్స్ రాలేదు. పంజాబ్ కింగ్స్‌ తరఫున రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ కనిపించకపోవడానికి ఇదే కారణం. లివింగ్‌స్టోన్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తనకు మరుసటి రోజు లేదా రెండు రోజుల్లో క్లియరెన్స్ లభిస్తుందని.. త్వరలో టీమ్‌తో జాయిన్ అవుతాన‌ని చెప్పాడు.

అయితే.. లివింగ్‌స్టోన్ కేసులో తాజాగా మరో ట్విస్ట్ వచ్చింది.. దీంతో పంజాబ్ కింగ్స్ శిబిరంలో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. బుధవారం గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత.. పంజాబ్ కింగ్స్ జట్టు అధికారి మాట్లాడుతూ.. లియామ్ లివింగ్‌స్టోన్ వచ్చే వారంలోగా జట్టులో చేరగలడని చెప్పాడు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB), లాంక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (LCCC) ద్వారా లివింగ్‌స్టోన్ జట్టులో చేరడానికి ఒక వారం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలిసింది.

లివింగ్‌స్టోన్ ఏప్రిల్ మధ్యలో పంజాబ్ జట్టులో చేరగలడు. అతను బాగా కోలుకుంటున్నాడు.. కానీ, ఇంకా 100 శాతం ఫిట్‌గా లేడు. అతను తన లాంక్‌షైర్ సహచరులతో కలిసి తన ఫిట్‌నెస్‌పై తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతని పునరావాసం ప్రస్తుతం మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో కొనసాగుతోంది. అతను ఏప్రిల్ 15 నాటికి భారతదేశానికి చేరుకోవచ్చని ఈసీబీ అధికారిని ఉటంకిస్తూ క్రిక్ బ‌జ్ పేర్కొంది. లియామ్ లివింగ్‌స్టోన్ ప్రస్తుతం జట్టుతో లేడు. కానీ అతను సోషల్ మీడియా ద్వారా జట్టును ప్రోత్సహిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ ఆడిన‌ రెండు మ్యాచ్‌లను గెలిచి గుజరాత్ టైటాన్స్ త‌ర్వాత‌ రెండవ స్థానంలో ఉంది.

లివింగ్‌స్టోన్ ఐపీఎల్‌లో మొత్తం 23 మ్యాచ్‌లు ఆడాడు.. 549 పరుగులుచేయ‌డంతో పాటు 6 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అతని స్ట్రైక్ రేట్ 166 కి పైగా ఉండ‌టం విశేషం.

Updated On 7 April 2023 2:01 AM GMT
Ehatv

Ehatv

Next Story