టీ20 సిరీస్(T20 Series)లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో భారత్ 4-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా రాణించారు. ఐసీసీ తాజాగా బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.
టీ20 సిరీస్(T20 Series)లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో భారత్ 4-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ సిరీస్‌లో అందరూ అద్భుతంగా రాణించారు. ఐసీసీ తాజాగా బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లోనూ భారత్ ఆటగాడే అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ప్రదర్శన ద్వారా అతడు ఎంతగానో లాభపడ్డాడు. అతడి ప్రదర్శనతో ఏకంగా నంబర్ 1 T20 బౌలర్‌గా మారాడు. ఈ ఘనత కేవలం 23 ఏళ్ల వయసులోనే బిష్ణోయ్ పేరిట నమోదైంది. బిష్ణోయ్ ఐదో స్థానం నుంచి నాలుగు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు.
రషీద్ ఖాన్‌ను దాటి రవి బిష్ణోయ్ ఈ ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో బిష్ణోయ్ 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అయితే అతడు తప్ప టాప్ 10లో మరో భారత బౌలర్ లేడు. మరోవైపు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో సూర్య అగ్రస్థానంలో ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్ ఒక స్థానం కోల్పోయాడు. రుతురాజ్ 6వ స్థానం నుంచి 7వ స్థానానికి పడిపోయాడు. టాప్ 10లో సూర్య, గైక్వాడ్ మాత్రమే ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్ 10లో 3వ స్థానంలో ఉన్న ఏకైక ఆటగాడు హార్దిక్ పాండ్యా మాత్రమే.
రవి బిష్ణోయ్ ఫిబ్రవరి 2022లో టీమిండియా తరపున తన T20 అరంగేట్రం చేశాడు. అతడు యుజ్వేంద్ర చాహల్ స్థానంలో జట్టులోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ ఇప్పటివరకూ 21 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 34 వికెట్లు తీశాడు.