క్రికెట్‌(Cricket) ఫ్యాన్స్‌ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌-2023(World Cup 2023) షెడ్యూల్‌(schedule) విడుదలయ్యింది. భారత్‌లో అక్టోబర్‌-నవంబర్‌ మాసాలలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ(ICC) విడుదల చేసింది. అక్టోబర్‌ 5వ తేదీన అహ్మదాబాద్‌(Ahmedabad) వేదికగా ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌(England-New Zealand) జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రపంచకప్‌ మొదలవుతుంది.

క్రికెట్‌(Cricket) ఫ్యాన్స్‌ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌-2023(World Cup 2023) షెడ్యూల్‌(schedule) విడుదలయ్యింది. భారత్‌లో అక్టోబర్‌-నవంబర్‌ మాసాలలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ(ICC) విడుదల చేసింది. అక్టోబర్‌ 5వ తేదీన అహ్మదాబాద్‌(Ahmedabad) వేదికగా ఇంగ్లాండ్‌-న్యూజిలాండ్‌(England-New Zealand) జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రపంచకప్‌ మొదలవుతుంది. ఉపఖండంలోని ప్రజలే కాదు, ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూసే భారత్‌, పాకిస్తాన్‌(India-Pakisthan Match) మ్యాచ్‌ అక్టోబర్‌ 15వ తేదీన జరుగుతుంది. అక్టోబర్‌ అయిదు నుంచి నవంబర్‌ 19 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్‌ మ్యాచ్‌(final match) కూడా అహ్మదాబాద్‌లోనే జరుగుతుంది. ఇక ఈ టోర్నీలో టీమిండియా(Team india) తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో(Australia) తలపడనుంది.

ఈ మ్యాచ్‌ అక్టోబర్‌ 8న చెన్నైలో(chennai) జరుగుతుంది. వార్మప్‌ మ్యాచ్‌లకు హైదరాబాద్‌తో పాటు, గౌహతి(Guwahati), తిరువనంతపురం(thiruvanantha Puram) ఆతిథ్యమిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో(Uppal Stadium) మూడు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియా ఆడే మ్యాచ్‌ల విషయానికి వస్తే అక్టోబర్‌ 11న ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో(afganisthan) పోటీపడుతుంది. అక్టోబర్‌ 19న పుణేలో బంగ్లాదేశ్‌తో(Bangladesh) భారత జట్టు తలపడుతుంది. అక్టోబర్‌ 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌ను(New Zealand)ఎదుర్కొంటుంది. అక్టోబర్‌ 29న లక్నోలో ఇంగ్లాండ్‌తో(England) పోటీపడుతుంది. నవంబర్‌ 2న ముంబాయిలో క్వాలిఫైర్‌ 2తో , నవంబర్‌ 5న సౌతాఫ్రికాతో, నవంబర్‌ 11న క్వాలిఫైర్‌తో టీమిండియా తలపడుతుంది.

Updated On 27 Jun 2023 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story