వన్డే ప్రపంచకప్(One Day World Cup) షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విముఖత(reluctance) వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వం(Pakisthan Government) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తమకు అందలేదని.. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లే విషయంలో పాక్ వైఖరిని ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు. దీనిపై ఐసీసీ(ICC) స్పందించింది. పీసీబీ ఒప్పందంపై సంతకం చేసిందని..

ICC Warning To Pakistan
వన్డే ప్రపంచకప్(One Day World Cup) షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విముఖత(reluctance) వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వం(Pakisthan Government) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తమకు అందలేదని.. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లే విషయంలో పాక్ వైఖరిని ఇంకా స్పష్టంగా తెలియజేయలేదు. దీనిపై ఐసీసీ(ICC) స్పందించింది. పీసీబీ ఒప్పందంపై సంతకం చేసిందని.. దానికి కట్టుబడి ఉండాలని ఐసీసీ తెలిపింది.
ఐసీసీ(ICC) ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ ఒప్పందం కుదుర్చుకుంది. పాక్ ఈ ఒప్పందాన్ని వదులుకోదు. భారతదేశానికి వస్తుందని మేము ఆశిస్తున్నాము. ప్రపంచ కప్‌లో పాల్గొనే అన్ని జట్లు ఐసీసీ నియమాలు, నిబంధనలకు(ICC Rules and regulations) కట్టుబడి ఉంటాయి. మేము వాటిని గౌరవిస్తాము. ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ కచ్చితంగా భారత్‌కు వస్తుంది. ఆ నమ్మకంతో ఉన్నామని ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జార్జ్ బార్క్లే(George Barclay) ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆఫ్ఘనిస్తాన్(afganisthan), ఆస్ట్రేలియాతో(Australia) జరిగే పాకిస్థాన్ మ్యాచ్‌ల వేదికను మార్చాలన్న పీసీబీ డిమాండ్‌ను ఐసీసీ(ICC), బీసీసీఐ(BCCI) తిరస్కరించాయి. దీంతో పాటు అహ్మదాబాద్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ ఇష్టపడటం లేదని మీడియా కథనాలలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రకటన పట్ల సందిగ్ధత నెలకొంది.
