వన్డే ప్రపంచకప్‌ టోర్నమెంట్‌(World Cup 2023) మొదలయ్యింది. ఇక క్రికెట్‌ ఫ్యాన్స్‌కు నెలన్నర రోజులు పండగే పండుగ. పుష్కర కాలం తర్వాత భారత్‌ ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తుండటంతో ఇండియన్‌ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది. అన్నట్టు ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఈ టోర్నీని ఇండియా నిర్వహించడం ఇదే మొదటిసారి. టైటిల్‌ ఫేవరెట్ జట్టుగా భారత్‌ బరిలో దిగుతోంది.

వన్డే ప్రపంచకప్‌ టోర్నమెంట్‌(World Cup 2023) మొదలయ్యింది. ఇక క్రికెట్‌ ఫ్యాన్స్‌కు నెలన్నర రోజులు పండగే పండుగ. పుష్కర కాలం తర్వాత భారత్‌ ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తుండటంతో ఇండియన్‌ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది. అన్నట్టు ఇతర దేశాలతో సంబంధం లేకుండా ఈ టోర్నీని ఇండియా నిర్వహించడం ఇదే మొదటిసారి. టైటిల్‌ ఫేవరెట్ జట్టుగా భారత్‌ బరిలో దిగుతోంది. ఈ సారి సెంటిమెంట్‌ కూడా ఇండియావైపే ఉంది. వన్డే ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకుంటే గత మూడు టోర్నమెంట్‌లోని సంప్రదాయాన్ని కొనసాగించినట్టు అవుతుంది. 2011లో వరల్డ్‌ కప్‌ను ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కలిసి నిర్వహించాయి. ఆ టోర్నీలో ఎమ్‌ఎస్‌ ధోనీ సారథ్యంలోని టీమిండియా విజేతగా నిలిచింది. 2015లో టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఆస్ట్రేలియాకే కప్‌ సొంతమయ్యింది. క్రితంసారి 2019లో జరిగిన టోర్నమెంట్‌కు ఇంగ్లాండ్‌ ఆతిథ్యమిచ్చంది. కప్‌ను కూడా ఎగరేసుకుపోయింది. మరి ఈ సంప్రదాయాన్ని భారత్‌ కొనసాగిస్తోందో లేదో చూడాలి. అలాగే ప్లేయర్లకు కొన్ని రికార్డులు కూడా ఊరిస్తున్నాయి. అందులో కొన్నింటిని పరికిద్దాం. ముందుగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ విషయానికి వస్తే ఎలాంటి బంతినైనా ఇట్టే బౌండరీకి తరలించడంలో ఇతగాడు దిట్ట. సిక్సర్లు కొట్టడం కూడా రోహిత్‌శర్మకు సింగిల్‌ తీసినంత సులువు. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో బోల్డన్నీ సిక్సర్లు బాదాడు. కాకపోతే అత్యధిక సిక్సర్ల రికార్డు వెస్టిండీస్‌ ప్లేయర్‌ క్రిస్‌ గేల్ పేరిట ఉంది. 551 ఇన్నింగ్స్‌లో 553 సిక్సులు కొట్టాడు గేల్‌. ఆ తర్వాత స్థానం మన రోహిత్‌దే! కేవలం 471 ఇన్నింగ్స్‌లోనే రోహిత్‌ 551 సిక్సులు బాదాడు. ఈ లెక్కన మరో మూడు సిక్సులు కొడితే గేల్‌ ప్రపంచ రికార్డు బద్దలవుతుందన్నమాట! మొదటి మ్యాచ్‌లోనే రోహిత్‌ ఈ రికార్డును సాధించే అవకాశం ఉంది. ఇప్పటికే వన్డేలలో రోహిత్‌ 292 సిక్సర్లతో మూడో ప్లేస్‌లో ఉన్న విషయం తెలిసిందే. సిక్సర్ల సంగతి పక్కన పెడితే వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగులకు రోహిత్‌ జస్ట్‌ 22 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం రోహిత్‌ 978 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ మైలురాయిని కూడా రోహిత్‌ మొదటిమ్యాచ్‌లోనే చేరుకునే ఛాన్సుంది. రోహిత్‌ ఇంకొక్క సెంచరీ చేస్తే వరల్డ్‌ కప్‌ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడవుతాడు. ప్రస్తుతం సచిన్‌ చేసిన ఆరు సెంచరీల రికార్డును రోహిత్‌ సమం చేశాడు.
విరాట్‌ కోహ్లీ విషయానికి వస్తే ఈయన ఖాతాలో 47 వన్డే సెంచరీలు ఉన్నాయి. వీటిని చేయడానికి విరాట్‌కు 269 ఇన్నింగ్స్‌ పట్టింది. మరో మూడు సెంచరీలు చేస్తే సెంచరీల సంఖ్య హాఫ్‌ సెంచరీకి చేరుతుంది. దీంతో సచిన్‌ తెందూల్కర్ పేరిట ఉన్న 49 సెంచరీల (452 ఇన్నింగ్స్‌లు) రికార్డు తుడిచిపెట్టుకుపోతుంది. వన్డే ఇంటర్నేషనల్లో 50 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచిపోతాడు. అలాగే విరాట్‌ ఒక్క క్యాచ్‌ పడితే వరల్డ్‌కప్‌లో ఇండియా తరఫున అత్యధిక క్యాచ్‌లను అందుకునన ఫీల్డర్‌గా మారతాడు. ప్రస్తుతం కోహ్లీ 26 ఇన్నింగ్స్‌లో 14 క్యాచ్‌లను పట్టి అనిల్‌ కుంబ్లే రికార్డు సమం చేశాడు.
ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్ వన్డేలలో అయిదు వేల పరుగుల మైలురాయికి 177 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఇతను 4,823 పరుగులతో కొనసాగుతున్నాడు. ఇందులో 11 సెంచరీలు, 25 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ జో రూట్‌ను కూడా ఓ రికార్డు ఊరిస్తున్నది. వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 16 ఇన్నింగులలో 758 పరుగులు చేసిన జో రూట్‌ మరో 140 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన వాడవుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు గ్రహం గూచ్‌ పేరిట ఉంది. గూచ్‌ 21 ఇన్సింగ్స్‌ల్లో 897 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వరల్డ్‌కప్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి మరో ఎనిమిది పరుగులు కావాలి. వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆస్ట్రేలియా ఆటగాడు అవుతాడు. ఇంతకు ముందు రికీ పాంటింగ్‌ (1,743), ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (1,085), మార్క్‌ వా (1,004) మాత్రమే వెయ్యి పరుగులు చేశారు. అలాగే వార్నర్‌ మరో రెండు సెంచరీలు చేస్తే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. రికీ పాంటింగ్‌ అయిదు సెంచరీలతో ఉంటే, వార్నర్‌ నాలుగు సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు 18 మ్యాచుల్లో 49 వికెట్లు తీశాడు. మరొక వికెట్ తీస్తే ఆస్ట్రేలియా తరఫున 50 వికెట్లు తీసిన రెండో బౌలర్‌ అవుతాడు. గ్లెన్‌ మెక్‌గ్రాత్ 71 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 39 మ్యాచుల్లో అతడు ఈ ఘనత సాధించాడు. దానిని అందుకోవడానికి స్టార్క్‌కు 23 వికెట్లు కావాలి. న్యూజిలాండ్‌కు చెందిన పేస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్డ్‌ వన్డేలలో 200 వికెట్ల క్లబ్‌లో చేరడానికి మూడు వికెట్లు కావాలి. ప్రస్తుతం 104 మ్యాచులలో 197 వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్‌ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసుకున్నది డానియల్‌ వెటోరీ. 291 మ్యాచ్‌లు ఆడిన వెటోరీ 273 వికెట్లు తీసుకున్నడు. ఈ వరల్డ్‌ కప్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ మరో 18 వికెట్లు సాధిస్తే న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌ అవుతాడు. వెటోరీ తర్వా మిల్స్‌ 240 వికెట్లు తీసుకోగా, టీమ్‌ సౌథీ 214 వికెట్లు తీసుకున్నాడు.

Updated On 5 Oct 2023 3:02 AM GMT
Ehatv

Ehatv

Next Story