హైదరాబాద్ మహిళా క్రికెటర్ల (women cricketers) పట్ల అనుచితంగా ప్రవర్తించాడు కోచ్ విద్యుత్ జైసింహ(vidyuth jaisimha). అతడి అసభ్య ప్రవర్తన కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు మహిళా క్రికెటర్లు

women cricketer
హైదరాబాద్ మహిళా క్రికెటర్ల (women cricketers) పట్ల అనుచితంగా ప్రవర్తించాడు కోచ్ విద్యుత్ జైసింహ(vidyuth jaisimha). అతడి అసభ్య ప్రవర్తన కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు మహిళా క్రికెటర్లు. మందుతాగుతూ తమను బూతులు తిట్టాడని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. ఓ మ్యాచ్ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన హైదరాబాద్ వుమెన్ టీమ్‌కు ఎదురైన చేదు అనుభవం ఇది. నిజానికి తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉంది. కానీ కోచ్ విద్యుత్ జైసింహ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ కావడంతో టీమంతా బస్సులో హైదరాబాద్‌కు రావల్సి వచ్చింది. బస్సులో మహిళా క్రికెటర్ల ముందే విద్యుత్ మద్యం సేవించాడు. వారు అభ్యంతరం చెప్పినందుకు ఆగ్రహంతో మహిళా క్రికెటర్లను బండ బూతులు తిట్టారు. ఆ సమయంలో సెలెక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావు (purnima Rao)అక్కడే ఉన్నారు. ఆమె విద్యుత్ జైసింహకు అడ్డు చెప్పకపోగా ఎంకరేజ్ చేశారు. విద్యుత్ జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే హైదరాబాద్ టీమ్ బస్సులో హెడ్ కోచ్ విద్యుత్ జైసింహా మద్యం (Alcohol)సేవిస్తూ కనిపించిన వీడియోలు వాట్సాప్ గ్రూప్‌లు, టీవీ చానెళ్లల్లో ప్రత్యక్షమవడంతో అతడిపై తక్షణం వేటు వేస్తున్నట్టు హెచ్‌సీఏ (HCA)అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు (jagan mohan Rao)ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, సదురు కోచ్‌పై తదుపరి చర్యలు తీసుకుంటామని జగన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని జగన్‌మోహన్ రావు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో తెలిపారు.
