ఐపీఎల్-2023 సీజన్(IPL2023 Season )లో ఇప్పటికే మెరికల్లాంటి ఆటగాళ్లను కొందరిని చూశాం. వారి బ్యాటింగ్ విన్యాసాలకు మురిసిపోయాం. అలాంటి కత్తిలాంటి బ్యాటర్లలో మన హైదరాబాద్ ఆటగాడు తిలక్‌వర్మ్(Tilak Varma) ఒకరు. ముంబాయి ఇండియన్స్(Mumbai Indians) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువ క్రికెటర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో అరుణ్‌జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌వర్మ దుమ్ము రేపాడు.
ఐపీఎల్-2023 సీజన్(IPL2023 Season )లో ఇప్పటికే మెరికల్లాంటి ఆటగాళ్లను కొందరిని చూశాం. వారి బ్యాటింగ్ విన్యాసాలకు మురిసిపోయాం. అలాంటి కత్తిలాంటి బ్యాటర్లలో మన హైదరాబాద్ ఆటగాడు తిలక్‌వర్మ్(Tilak Varma) ఒకరు. ముంబాయి ఇండియన్స్(Mumbai Indians) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ యువ క్రికెటర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో అరుణ్‌జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌వర్మ దుమ్ము రేపాడు. చక్కటి ఇన్నింగ్స్‌తో తన జట్టు విజయంలో ప్రధాన భూమికను పోషించాడు. కీలక సమయంలో బరిలో దిగిన తిలక్‌వర్మ 29 బంతుల్లో ఒక బౌండరీ, నాలుగు సిక్సర్లతో 41 పరుగులు చేశారు. ముఖేశ్ కుమార్(Mukeh Kumar) వేసిన ఇన్నింగ్స్‌లోని 16 వ ఓవర్‌లో వరుసగా ఫోర్, రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ విధంగా ముంబాయి విజయం సులువు చేశాడు. ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 147 పరుగులు చేసి ముంబాయి తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో తిలక్ వర్మ అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ మ్యాచ్‌లో 46 బంతుల్లోనే తొమ్మిది బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్‌వర్మ బ్యాటింగ్‌ను క్రికెట్ విశ్లేషకులు తెగ మెచ్చుకుంటున్నారు. బ్యాటింగ్‌కు కష్టంగా మారుతున్న పిచ్‌పై తిలక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని, అతడు ముంబాయి టీమ్‌కు దొరికిన విలువైన ఆస్తి అంటూ ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే(Harsha Bhogle) ప్రశంసించారు. మిడిలార్డర్(middleorder)లో అద్భుతంగా రాణించే కెపాసిటీ ఉన్న తిలక్‌వర్మ ఇవాళ కాకపోయినా రేపైనా టీమిండియా(TeamIndia)లో చోటు సంపాదించుకోవడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.