భారత్, పాకిస్తాన్(India vs Pakistan) మధ్య క్రికెట్ మ్యాచ్‌కు విపరీమైన క్రేజ్ ఉంటుంది. ఎక్కడ మ్యాచ్ జరిగినా ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఇక ప్రపంచకప్‌లో దాయాదులు తలపడుతున్నాయంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రత్యక్షంగా చూడటానికి ఆసక్తికనబరుస్తారు క్రికెట్ అభిమానులు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా అహ్మదాబాద్(Ahmedabad)లో భారత్-పాక్ తలపడబోతున్నాయన్న విషయం తెలిసిందే కదా!
భారత్, పాకిస్తాన్(India vs Pakistan) మధ్య క్రికెట్ మ్యాచ్‌కు విపరీమైన క్రేజ్ ఉంటుంది. ఎక్కడ మ్యాచ్ జరిగినా ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివస్తారు. స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఇక ప్రపంచకప్‌లో దాయాదులు తలపడుతున్నాయంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రత్యక్షంగా చూడటానికి ఆసక్తికనబరుస్తారు క్రికెట్ అభిమానులు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా అహ్మదాబాద్(Ahmedabad)లో భారత్-పాక్ తలపడబోతున్నాయన్న విషయం తెలిసిందే కదా! ఆ పోరును ప్రత్యక్షంగా చూడాలన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే ఆ నగరంలోని ఆల్‌మోస్టాల్ అన్ని హోటల్స్ బుక్ అయిపోయాయి. మామూలు హోటళ్ల నుంచి మొదలుకొని స్టార్ హోటళ్ల వరకు రికార్డు రేంజ్‌లో ధరలు పలుకుతున్నాయి. ఇప్పుడు విమాన టికెట్లకు కూడా డిమాండ్ పెరిగింది. దాంతో రేట్లు కూడా కొండెక్కాయి. మామూలుగా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్(Delhi to Ahmedabad) కు ఒక్కొక్కరికి రెండున్నర వేల నుంచి మూడు వేల వరకు టికెట్ రేటు ఉంటుంది. కానీ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కారణంగా ఈ ధర ఏకంగా ఆరింతలు పెరిగిందట. ఇప్పుడు అదే టికెట్ 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు ధర పలుకుతోంది. తమ వెబ్‌సైట్‌లో టిక్కెట్ల కోసం అన్వేషించే వారి సంఖ్య అమాంతం పెరిగిందని ఈజీ మై ట్రిప్ ప్రతినిధి ఒకరు తెలిపారు.