విశాఖలో (Vizag) ఇంగ్లాండ్‌తో (England) జరుగుతున్న రెండో టెస్టులో (Second Test) బూబ్ బూమ్ బూమ్రా (Bumhra) కళ్లు చెదిరే బంతిని విసరడంతో వికెట్ల ముందు ఇంగ్లాండ్ స్కిప్పర్ బెన్‌స్టోక్స్ (Ben stokes) దొరికిపోయాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్‌లో రెండో బంతిని అత్యధ్బుతం వేసి బెన్‌స్టోక్స్‌ను ఆశ్చర్యపరిచాడు.
విశాఖలో (Vizag) ఇంగ్లాండ్‌తో (England) జరుగుతున్న రెండో టెస్టులో (Second Test) బూబ్ బూమ్ బూమ్రా (Bumhra) కళ్లు చెదిరే బంతిని విసరడంతో వికెట్ల ముందు ఇంగ్లాండ్ స్కిప్పర్ బెన్‌స్టోక్స్ (Ben stokes) దొరికిపోయాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్‌లో రెండో బంతిని అత్యధ్బుతం వేసి బెన్‌స్టోక్స్‌ను ఆశ్చర్యపరిచాడు. తొలి బంతిని స్టోక్స్ ఎదుర్కొన్నా పరుగులేమీ రాలేదు. కట్టర్ సంధించి స్టోక్స్‌ని చెరబట్టాడు. ఆఫ్ స్టంప్ దిశగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్టోక్స్ డిఫెండ్ చేసేందుకు యత్నించగా మిస్ ఫైరయి ఆఫ్ స్టంప్‌ను కూల్చింది. దీంతో స్టోక్స్ అసలు వెనక్కి తిరిగి చూడలేదు. బ్యాట్‌ను కింద పడేసి ఈ బంతిని అసలు ఎలా ఆడాలన్నట్లు ఫీలింగ్స్ పెట్టాడు. నిరాశతో క్రీజును వదిలివెళ్లిపోయాడు. అయితే ఈ అద్భుత వికెట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను బూమ్రా కుప్పకూల్చాడు. ఏకంగా బూమ్రా ఆరు వికెట్లు తీసుకున్నాడు. బూమ్రా దెబ్బతో ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆలౌటైంది. దీంతో టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయికి బూమ్రా చేరుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ అర్ధసెంచరీ దిశగా సాగుతున్న సమయంలో 47 పరుగుల వద్ద బూమ్రా వేసిన చక్కటి బంతితో అతడు క్రీజును వదలాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ (Bharath) 396 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.