పాకిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ ప్రకటించారు. సౌతాఫ్రికా సారధిగా విధ్వంసకర వీరుడు,

పాకిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్‌ కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ ప్రకటించారు. సౌతాఫ్రికా సారధిగా విధ్వంసకర వీరుడు, వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌ కమిట్‌మెంట్స్‌ కారణంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో రెండో టెస్ట్‌ ముగిసిన మరుసటి రోజే టీ20 సిరీస్‌ మొదలుకానుండటంతో మార్క్రమ్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. పాక్‌తో సౌతాఫ్రికా మూడు టీ-20 మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రస్తుతం టెస్ట్ టీమ్‌లో ఉన్న మార్కో జన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌, కగిసో రబాడ, ట్రిస్టన్‌ స్టబ్స్‌ కూడా టీ-20 సిరీస్‌కు దూరంగా ఉన్నారు. ర్యాన్‌ రికెల్టన్‌, క్వేనా మపాకా, మాథ్యూ బ్రీట్జ్కీ మాత్రం టీమ్‌లో చోటు సంపాదించుకున్నారు.టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత టీమ్‌కు దూరంగా ఉన్న అన్రిచ్‌ నోర్జే, తబ్రేజ్‌ షంషి పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌(T 20 series)కు ఎంపికయ్యారు. మూడేళ్లకు పైగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న జార్జ్‌ లిండేకు కూడా జట్టులో చోటు కల్పించారు. దక్షిణాఫ్రికా(South Africa)లో పర్యటించనున్న పాకిస్తాన్‌ టీమ్‌ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. డిసెంబర్‌ 10, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. తర్వాత డిసెంబర్‌ 17, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. డిసెంబర్‌ 26-30 వరకు తొలి టెస్ట్‌.. జనవరి 3-7 వరకు రెండో టెస్ట్‌ జరుగనున్నాయి.

ehatv

ehatv

Next Story