అదేదో నానుడి ఉందిగా... Don't judge a book by its cover అన్నట్టుగానే తొందరపడి ఎప్పుడూ ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు. ఇప్పుడీ విషయం ఎందుకంటే హ్యారీ బ్రూక్‌ను (harry brook) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)పెద్దమొత్తం వెచ్చించి కొనుగోలు చేసినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడే ఆటగాడిని ఐపీఎల్‌కు తీసుకురావడమే దండగ అంటే, 13.25 కోట్ల రూపాయలు పెట్టి కొనడం ఇంకా దండగ అని ఈసడించుకున్నారు.

అదేదో నానుడి ఉందిగా... Don't judge a book by its cover అన్నట్టుగానే తొందరపడి ఎప్పుడూ ఓ నిర్ణయానికి వచ్చేయకూడదు. ఇప్పుడీ విషయం ఎందుకంటే హ్యారీ బ్రూక్‌ను (harry brook) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad)పెద్దమొత్తం వెచ్చించి కొనుగోలు చేసినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడే ఆటగాడిని ఐపీఎల్‌కు తీసుకురావడమే దండగ అంటే, 13.25 కోట్ల రూపాయలు పెట్టి కొనడం ఇంకా దండగ అని ఈసడించుకున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇలాంటి వారిని ఎందుకు కొనుగోలు చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. తొలి మూడు మ్యాచ్‌లలో హ్యారీ బ్రూక్‌ విఫలమయినప్పుడు ఇలాంటి విమర్శలు చాలానే వచ్చాయి. సోషల్‌ మీడియాలో అయితే బ్రూక్‌ను విపరీతంగా ట్రోల్‌ చేశారు. అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్‌ మార్క్రమ్‌కు(Aiden Markram), ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్రాంచైజీకి బ్రూక్‌ మీద బోలెడంత నమ్మకం ఉంది. నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (kolkata knight riders)జరిగిన మ్యాచ్‌లో బ్రూక్‌ తన సత్తా చాటుకున్నాడు. తన బ్యాటింగ్‌ పవర్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్రూక్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 32 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో హాఫ్‌ సెంచరీ చేశారు.

హ్యారీ బ్రూక్‌కు ఇదే మొదటి ఐపీఎల్‌ సీజన్‌. టెస్ట్‌ల్లో ఇతడికి మంచి రికార్డు ఉంది. ఒక్కసారి క్రీజ్‌లో సెటిల్‌ అయ్యాడంటే ఇతడిని అవుట్‌ చేయడం చాలా కష్టం. నిజానికి ఎంత పెద్ద క్రికెటర్‌ అయినా క్రీజ్‌లో కాసేపు కుదురుకునే వరకు పరుగులు చేయడం కష్టమే. హ్యారీ బ్రూక్‌ అంతటి బ్యాటర్‌కు కూడా ఇది అనుభవమే. ప్రస్తుతం ఆ స్టేజ్‌ నుంచి బయటకు వచ్చాడనిపిస్తోంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు చూపిన ప్రతిభే ఇందుకు నిదర్శనం. బ్రూక్‌ ఫామ్‌లోకి వస్తే అతడిని నిలువరించడం చాలా కష్టం. ఓపెనింగ్‌లో పంపిస్తే రాణించే అవకాశం ఉంటుందని ఓ మాజీ క్రికెటర్‌ గతంలో అన్నాడు. ఆయన అన్నది ఇప్పుడు నిజమయ్యింది. ఈమధ్యనే ముగిసిన పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లోనూ హ్యారీ బ్రూక్‌ ఆరంభంలో విఫలం చెందాడు. ఒక్కసారి కుదురుకున్న తర్వాత రెచ్చిపోయాడు. మొత్తం పది మ్యాచులు ఆడిన బ్రూక్‌ ఏడు ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్‌ ఈ సీజన్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా బ్రూక్‌ రికార్డు సృష్టించాడు. అన్నట్టు ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ మార్క్రమ్‌ చేసిన హాఫ్‌ సెంచరీ కూడా గొప్పదే.

Updated On 14 April 2023 11:37 PM GMT
Ehatv

Ehatv

Next Story