ప్రపంచకప్‌లో(worldcup) భారత్‌కు గట్టి దెబ్బే తగిలింది. టీమిండియా(Team India) అభిమానులకు షాకింగ్ న్యూస్ మెగాటోర్నీ(Mega Tornament) నుంచి హార్దిక్(Hardik Pandya) దూరమయ్యాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ ఇప్పుడు టోర్నీ నుంచే వైదలగాడు. హార్దిక్ స్థానంలో మరో యువ బౌలర్‌ను భారత్ జట్టులోకి తీసుకుంది.

Hardik Pandya
ప్రపంచకప్‌లో(worldcup) భారత్‌కు గట్టి దెబ్బే తగిలింది. టీమిండియా(Team India) అభిమానులకు షాకింగ్ న్యూస్ మెగాటోర్నీ(Mega Tornament) నుంచి హార్దిక్(Hardik Pandya) దూరమయ్యాడు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన హార్దిక్ ఇప్పుడు టోర్నీ నుంచే వైదలగాడు. హార్దిక్ స్థానంలో మరో యువ బౌలర్‌ను భారత్ జట్టులోకి తీసుకుంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ సమయంలో బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడ్డాడు. చీలమండ గాయం కావడంతో ఆ ఓవర్‌లో మూడు బంతులే వేసి వెనుదిరిగాడు. మిగతా మూడు బంతులు కోహ్లీ వేయడం జరిగింది. తొలుత మూడు మ్యాచ్‌లకు దూరమవుతాడని మేనేజ్‌మెంట్ చెప్పినా.. గాయం(Injury) తీవ్రత కారణంగా అతడికి రెస్ట్ ఇవ్వాలని భావించింది. టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు హార్దిక్ దూరమైనట్లు ఐసీసీ(ICC) ప్రకటించింది. హార్దిక్ స్థానంలో యువ బౌలర్ ప్రసిధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు.
వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం కావడం అభిమానులకు షాకింగ్ న్యూసే. ప్రస్తుతం భారత్ ఏడు మ్యాచ్‌ల్లో ఆడి ఏడింటిలోనూ గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో(South Africa)భారత్ తలపడనుంది. లీగ్ దశను అగ్రస్థానంలో ముగించాలనుకున్న భారత్‌కు హార్దిక్ పాండ్యా నిరాశ కలిగించే వార్త. జట్టులోని మిగతా సభ్యులంతా మంచి ఫామ్‌ల ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశమని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. లీగ్ దశలో ఈనెల 12న బెంగళూరులో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది.
