టీమిండియాకు(Team India) భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో(Bangladesh) గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) గాయపడ్డాడు. కుడికాలితో బంతిని అడ్డుకోవాలని చూసి పట్టుతప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు. మడిమకు గాయం కావడంతో పాండ్యా మైదానం వీడాడు.

Hardik Pandya
టీమిండియాకు(Team India) భారీ షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో(Bangladesh) గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) గాయపడ్డాడు. కుడికాలితో బంతిని అడ్డుకోవాలని చూసి పట్టుతప్పి తన ఎడమకాలిపై పడిపోయాడు. మడిమకు గాయం కావడంతో పాండ్యా మైదానం వీడాడు. దీంతో స్టార్ బ్యాటర్, రైటార్మ్ మీడియం పేసర్ విరాట్ కోహ్లి వచ్చి పాండ్యా ఓవర్ పూర్తి చేశాడు. పాండ్యాను స్కానింగ్ కోసం తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల అనంతరమే హార్దిక్ పాండ్యా పరిస్థితిపై అంచనాకు వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. ఒకవేళ హార్దిక్ పాండ్యా గనుక గాయం తీవ్రత ఎక్కువై జట్టుకు దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే! అలా జరగకూడదనే కోరుకుందాం! గెట్ వెల్ సూన్ పాండ్యా...!
