మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఖాతాలో బోల్డన్నీ రికార్డులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీల రికార్డు మాత్రం ప్రత్యేకమైనది. ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంటుందని అనుకున్నారు. ఏ రికార్డు అయినా ఎప్పుడో ఒకప్పుడు చెరిగిపోవాల్సిందే కదా! సచిన్‌ నూరు సెంచరీల రికార్డు నెలకొల్పినప్పుడు ఆయనకు దరిదాపుల్లో మరో క్రికెటర్‌ లేడు.

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఖాతాలో బోల్డన్నీ రికార్డులు ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీల రికార్డు మాత్రం ప్రత్యేకమైనది. ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంటుందని అనుకున్నారు. ఏ రికార్డు అయినా ఎప్పుడో ఒకప్పుడు చెరిగిపోవాల్సిందే కదా! సచిన్‌ నూరు సెంచరీల రికార్డు నెలకొల్పినప్పుడు ఆయనకు దరిదాపుల్లో మరో క్రికెటర్‌ లేడు. అందుకే అది అసాధ్యమనుకున్నారు. కానీ టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడు. ఉంటే గింటే వంద సెంచరీలు సాధించే కెపాసిటీ తనకే ఉందని చాటి చెబుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో అద్భుతమైన సెంచరీ సాధించడంతో అందరి దృష్టి మళ్లీ కోహ్లీపై పడింది. సుమారు 40 నెలల తర్వాత టెస్టుల్లో కోహ్లీ సెంచరీ సాధించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలోనే సచిన్‌ నెలకొల్పిన వంద సెంచరీల రికార్డును కోహ్లీ సునాయాసంగా బ్రేక్‌ చేయగలడని మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ కామెంట్‌ చేశాడు.

34 ఏళ్ల కోహ్లీ ఎంత కాదనుకున్నా ఓ నాలుగేళ్లపాటు అవలీలగా క్రికెట్‌ ఆడగలడు. ప్రస్తుతం ఆయన ఫిట్‌నెస్‌ పరంగా 24 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడంటూ హర్భజన్‌ ప్రశంసించాడు. నూరు శతకాలు కొట్టడం ఇప్పుడైతే సాధ్యమే. విరాట్‌ కోహ్లీ అంతకంటే ఎక్కువ సెంచరీలు చేయగలడని అనుకుంటున్నానని హర్భజన్‌ అన్నాడు. ఇందుకు విరాట్‌కు రెండు విషయాలు అనుకూలంగా ఉన్నాయని, ఒకటి అతడి వయస్సు, రెండోది ఫిట్‌నెస్‌ అని హర్భజన్‌ వివరించాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో ఇప్పటికే విరాట్‌ 75 సెంచరీలు చేశాడు. తన ఆటపై కోహ్లీకి చక్కటి అవగాహన ఉంది. అన్ని ఫార్మట్లలోనూ అద్భుతంగా ఆడే నైపుణ్యం ఉంది. తానేమీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో చెప్పడం లేదని, సచిన్‌ రికార్డును కోహ్లీ తప్పనిసరిగా తుడిచిపెడతానని, అసలు ఆ రికార్డను ఎవరైనా బద్దలు కొట్టగలరంటే అది విరాట్ మాత్రమేనని హర్భజన్‌ అన్నాడు.

Updated On 14 March 2023 12:15 AM GMT
Ehatv

Ehatv

Next Story