గుజరాత్‌ టైటాన్స్(Gujarat Titans) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో 163 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. సొంత మైదానంలో ఆడుతున్న ఢిల్లీకి వరుసగా ఇది రెండో ఓటమి. ఐపీఎల్‌ -2023(IPL 2023)లో గుజరాత్‌ టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ప్లేస్‌లో నిలిచింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

గుజరాత్‌ టైటాన్స్(Gujarat Titans) వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో 163 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. సొంత మైదానంలో ఆడుతున్న ఢిల్లీకి వరుసగా ఇది రెండో ఓటమి. ఐపీఎల్‌ -2023(IPL 2023)లో గుజరాత్‌ టైటాన్స్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ప్లేస్‌లో నిలిచింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌(David Warner) 32 బంతుల్లో ఏడు ఫోర్లతో 37 పరుగులు చేయగా, అక్షర్‌ పటేల్‌(Axar Patel) 22 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ రెండు ఫోర్లతో 30 పరుగులు సాధించాడు. రషీద్‌ఖాన్‌(Rashid Khan), షమీ(Shami)లకు చెరో మూడు వికెట్లు వచ్చాయి. తర్వాత బరిలో దిగిన గుజరాత్‌ టైటాన్స్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 163 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడి, ఈసారి ఫైనల్‌ టీమ్‌లోకి వచ్చిన తమిళనాడు ఆటగాడు సాయి సుదర్శన్‌ 48 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 62 పరుగులు చేశాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మిల్లర్‌ 16 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో అజేయంగా 31 పరుగులు చేశాడు. వీరిద్దరు అయిదో వికెట్‌కు 29 బాల్స్‌లోనే 56 పరుగులు జోడించారు. తొలి మ్యాచ్‌లోలాగే ఈ మ్యాచ్‌లో కూడా ఢిల్లీ బ్యాటింగ్‌ సాదాసీదాగా ఉంది. పృథ్వీ షా, మిచెల్‌ మార్ష్ మళ్లీ ఫెయిలయ్యారు. వార్నర్‌ బ్యాట్‌ నుంచి మెరుపులేమీ రాలేదు. అందుకు కారణం గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగే. తన వరుస ఓవర్లలో పృథ్వీ షా, మార్ష్ లను షమీ పెవిలియన్‌కు పంపించాడు. తర్వాత జోసెఫ్‌ వరుస బంతుల్లో వార్నర్‌, రోసోలను అవుట్‌ చేశాడు. ఇక ఆ తర్వాత ఢిల్లీ కోలుకోలేకపోయింది. సర్ఫరాజ్‌ వేగంగా పరుగులు చేయలేకపోయాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర జోష్‌ లిటిల్‌ ఈజీ క్యాచ్‌ వదిలేశాడు..దాన్ని కూడా సర్ఫరాజ్‌ వినియోగించుకోలేకపోయాడు. 101/5 దగ్గర క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్‌ ధాటిగా ఆడాడు. చివర్లో అతను కొట్టిన మూడు సిక్సర్లతోనే ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

టార్గెట్‌ పెద్దది కాకపోయినా గుజరాత్‌ ఆరంభంలో కాసింత కష్టపడాల్సి వచ్చింది. వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. ఆరు ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోరు మూడు వికెట్లకు 54 రన్స్‌. సాయి సుదర్శన్‌, మిల్లర్‌, విజయశంకర్‌ (29, 23 బంతుల్లో మూడు ఫోర్లు) ఆడబట్టి గుజరాత్‌కు విజయం సులభమయ్యింది. ఇక మోకాలి గాయంతో ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు దూరమైన కేన్‌ విలియమ్సన్‌ ప్లేస్‌లో శ్రీలంక కెప్టెన్‌ దాసున్‌ షనకను గుజరాత్‌ టైటాన్స్ జట్టులో తీసుకుంది. గత ఐపీఎల్‌ వేలంలో షనకను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు విలియమ్సన్‌ స్థానంలో షనకతో అతని కనీస ధర 50 లక్షల రూపాయలకు గుజరాత్‌ టైటాన్స్‌ ఒప్పందం చేసుకుంది.

స్కోరు బోర్డు
ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)
వార్నర్‌ (బి) జోసెఫ్‌ 37; పృథ్వీ షా (సి) జోసెఫ్‌ (బి) షమీ 7; మార్ష్ (బి) షమీ 4; సర్ఫరాజ్‌ (సి) లిటిల్‌ (బి) రషీద్‌ 30; రోసో (సి) తెవాటియా (బి) జోసెఫ్‌ 0; పోరెల్‌ (బి) రషీద్‌ 20; అక్షర్‌ (సి) మిల్లర్‌ (బి) షమీ 36; అమన్‌ ఖాన్‌ (సి) పాండ్యా (బి) రషీద్‌ 8; కుల్దీప్‌ (నాటౌట్‌) 1; నోర్జే (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–29, 2–37, 3–67, 4–67, 5–101, 6–130, 7–148, 8–158. బౌలింగ్‌: షమీ 4–0–41 –3, లిటిల్‌ 4–0–27–0, పాండ్యా 3–0–18–0, జోసెఫ్‌ 4–0–29–2, యష్‌ దయాల్‌ 1–0–12–0, రషీద్‌ ఖాన్‌ 4–0–31–3.
గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans)
సాహా (బి) నోర్జే 14; గిల్‌ (బి) నోర్జే 14; సుదర్శన్‌ (నాటౌట్‌) 62; పాండ్యా (సి) పోరెల్‌ (బి) ఖలీల్‌ 5; విజయ్‌ శంకర్‌ (ఎల్బీ) (బి) మార్ష్ 29; మిల్లర్‌ (నాటౌట్‌) 31; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–22, 2–36, 3–54, 4–107. బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–38–1, ముకేశ్‌ 4–0–42–0, నోర్జే 4–0–39–2, మార్ష్ 3.1–0–24–1, కుల్దీప్‌ 3–0–18–0.

Updated On 4 April 2023 11:39 PM GMT
Ehatv

Ehatv

Next Story