గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ అభిమానులైతే తిట్టిపోస్తున్నారు. ఈ విమర్శలకు, దూషణాలకు కారణమేమిటంటే అతడు సరిగ్గా ఆడకపోవడం. నిన్న ముంబాయి ఇండియన్స్(Mumbai indians0తో జరిగిన మ్యాచ్‌లోనూ పాండ్యా ఫ్లాప్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌కు పాండ్యా గుదిబండలా మారాడంటూ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్ అభిమానులైతే తిట్టిపోస్తున్నారు. ఈ విమర్శలకు, దూషణాలకు కారణమేమిటంటే అతడు సరిగ్గా ఆడకపోవడం. నిన్న ముంబాయి ఇండియన్స్(Mumbai indians)తో జరిగిన మ్యాచ్‌లోనూ పాండ్యా ఫ్లాప్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌కు పాండ్యా గుదిబండలా మారాడంటూ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. చివరిసారిగా అతడు టీమ్‌కు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ను ఎప్పుడు ఆడాడో అతడికైనా గుర్తుందా అని నిలదీస్తున్నారు. ఎప్పుడైతే కెప్టెన్ అయ్యాడో అప్పుడే అతడికి అహంకారం తలకెక్కిందని, ఓ రెండు మూడు మ్యాచ్‌ల్లో పాండ్యాను పక్కన పెడితే తప్ప తప్పు తెలుసుకునేలా లేడని అంటున్నారు. కెప్టెన్ కాబట్టి తనను ఎవరూ ఏమి చేయరన్న తలబిరుసుతో వ్యవహరిస్తున్నాడని, గుజరాత్ టైటాన్స్ మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా టీమ్ మేనేజ్‌మెంట్ యాక్షన్‌లోకి దిగకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హితవు చెబుతున్నారు.
టీమ్ మెంబర్స్‌లో అతడి బిహేవియర్ కూడా బాగుండటం లేదని, కెప్టెన్ అన్న గర్వంతో బూతులు తిడుతున్నాడని గుజరాత్ ఫ్యాన్స్(Gujarat Fans) అంటున్నారు. తోటి సభ్యులపై పెత్తనం చెలాయించాలన్నది అతగాడి అభిమతమని మండిపడుతున్నారు. పోనీ బౌలింగ్‌లోనైనా పొడుస్తున్నాడా అంటే అక్కడా అట్టర్ ఫ్లాపేనని, టీమ్‌లోని మిగతా సభ్యులు ఆడుతున్నారు కాబట్టి నెట్టుకురాగలుగుతున్నాడని క్రికెట్ లవర్స్ విశ్లేషిస్తున్నారు. గెలిస్తే తన కెప్టెన్సీ కారణంగానే అంటూ లేనిపోని బిల్డప్పులిస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. బ్యాటింగ్‌లో వృద్ధిమన్ సాహా, శుభ్‌మన్ గిల్, విజయ్‌శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్‌లు, బౌలింగ్‌లో మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్‌లు రాణిస్తున్నారు కాబట్టి గుజరాత్ టీమ్ వరుస విజయాలు సాధించిదని, ఇంతులో హార్దిక్ పాండ్యా కాంట్రిబ్యూషన్ పిసరంత కూడా లేదని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 బంతుల్లో ఎనిమిది పరుగులు చేసిన పాండ్యా బౌలింగ్‌లో 28 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఢిల్లీపై నాలుగు బంతుల్లో అయిదు పరుగులు చేసిన పాండ్యా బౌలింగ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
పంజాబ్(Punjab)పై ఎనిమిది పరుగులు చేశాడు. రాజస్తాన్(Rajastan)పై 28 పరుగులు, 24 పరుగులకు ఒక వికెట్‌ను సాధించాడు. లక్నో(Lucknow)పై మాత్రం 50 బంతుల్లో 66 పరుగులు చేయగలిగాడు. బౌలింగ్‌లో మాత్రం విఫలమయ్యాడు. ముంబాయి(Mumbai)పై 13 పరుగులు చేశాడు. పది పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఆడిన ఏడు మ్యాచ్‌లలో అయిదింటిలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్‌లో ఉంది. మరి రెండో అర్థభాగం ఐపీఎల్‌లో పాండ్యా ఎలా ఆడతాడో చూడాలి.