ఐపీఎల్‌ టోర్నమెంట్‌ (IPL 2023)లో బ్యాటర్స్‌ (batters)హవానే ఇప్పటి వరకు కొనసాగింది. టీ-20 (t-20)అంటేనే సిక్సర్లు, బౌండరీలు. సింగిల్స్‌ తీయడమన్నది ఎప్పుడో కానీ చూడం. సిక్సర్లు, ఫోర్లు బాదాలన్న కసి ప్రతీ బ్యాటర్‌లోనూ ఉంటుంది. ఐపీఎల్‌లో ఎవరెన్ని సిక్సర్లు (sixers) కొట్టారు? లాంగెస్ట్ సిక్సర్‌ ఎవరు బాదారు? ఎన్ని మీటర్ల దూరంలో బాల్‌ పడింది? బౌండరీల కౌంట్‌ ఎంత? ఇలాంటి లెక్కలే టోర్నీ ముగిసిన తర్వాత వేసుకుంటారు.

ఐపీఎల్‌ టోర్నమెంట్‌ (IPL 2023)లో బ్యాటర్స్‌ (batters)హవానే ఇప్పటి వరకు కొనసాగింది. టీ-20 (t-20)అంటేనే సిక్సర్లు, బౌండరీలు. సింగిల్స్‌ తీయడమన్నది ఎప్పుడో కానీ చూడం. సిక్సర్లు, ఫోర్లు బాదాలన్న కసి ప్రతీ బ్యాటర్‌లోనూ ఉంటుంది. ఐపీఎల్‌లో ఎవరెన్ని సిక్సర్లు (sixers) కొట్టారు? లాంగెస్ట్ సిక్సర్‌ ఎవరు బాదారు? ఎన్ని మీటర్ల దూరంలో బాల్‌ పడింది? బౌండరీల కౌంట్‌ ఎంత? ఇలాంటి లెక్కలే టోర్నీ ముగిసిన తర్వాత వేసుకుంటారు. బ్యాటర్స్‌ కూడా ఆరెంజ్‌ క్యాప్‌ (Orange Cap)కోసం పోటీ పడి రన్స్‌ చేస్తుంటారు. 15 ఎడిషన్ల ఐపీఎల్‌లో ఇదే చూశాం. కానీ ఈసారి బ్యాట్స్‌మెన్‌ పప్పులు అంతగా ఉడకవట! ఈజీగా పరుగులు చేయడం ఇక కుదరదట! అందుకు కారణం.. పిచ్‌ల స్వభావం మారడం. ఒకప్పుడు టీ-20 క్రికెట్‌ అంటేనే పరుగుల వరద పారడం ఖాయమని అనుకునేవాళ్లం. ఇప్పుడు అర్థంకాని పిచ్‌(pitch)లు ఆ ఫార్మట్‌ క్రికెట్‌నూ మార్చేశాయి. ఇటీవలి కాలంలో టీ-20లలో బౌలర్ల డామినేషన్‌ పెరిగింది. బౌలర్లు కూడా గొప్పగా రాణిస్తున్నారు. వరుసపెట్టి వికెట్లు తీస్తున్నారు. టీ-20 అంటే కేవలం బ్యాటర్లదే కాదు, బౌలర్లది కూడా అని రుజువు చేస్తున్నారు. ఇవాళ జరిగే మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడుతున్నాయి.

ఇందులో ఏ జట్టు గెలుస్తుందన్నదానిపై అప్పుడే బెట్టింగులు మొదలయ్యాయి. అహ్మదాబాద్‌(ahmedabad)లోని నరేంద్రమోదీ స్టేడియం (narendra modi stadium) పిచ్‌ ఎలా బిహేవ్‌ చేస్తుందన్నదానిపై ఆరాలు తీయడం మొదలుపెట్టారు. పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలిస్తుందా? బౌలర్లకా? అంటే అహ్మదాబాద్‌ పిచ్‌ బౌలర్లకే ఎక్కువగా అనుకూలిస్తుందంటున్నారు. ఇక్కడి పిచ్‌పై తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాట్స్‌మెన్‌ పరుగులు తీయడానికి ఇబ్బంది పడతారు. మొదట బ్యాటింగ్‌ చేసే జట్టు 150 కంటే ఎక్కువ పరుగులు చేస్తే ఆ జట్టుకే విజయవకాశాలు మెండుగా ఉంటాయి. లో స్కోరింగ్‌ మ్యాచ్ కూడా కావచ్చు. ఒక్క అహ్మదాబాద పిచ్‌ మాత్రమే కాదు, ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగే అన్ని స్టేడియంల పిచ్‌లు ఇలాగే ఉన్నాయట. పిచ్‌ల స్వభావం ఎలా ఉందో ముందే చెప్పలేని పరిస్థితి నెలకొంది. క్యూరేటర్లు (curetor)మాత్రం పిచ్‌లన్నీ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలించే విధంగానే తయారు చేశామని అంటున్నారు.

క్యూరెటర్లు అలా అంటున్నారు కానీ పరుగులు రాబట్టడం కష్టమేనని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం క్యుములో నింబస్‌ మేఘాల కారణంగా ఉపరిత ఆవర్తనం రోజురోజుకీ మారుతూ వస్తుంది. వాతావరణంలోని ఈ మార్పుల వల్ల పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉండటం లేదట. మొత్తం మీద ఐపీఎల్‌-16లో బౌలర్ల ఆధిపత్యాన్ని చూడవచ్చు.

Updated On 31 March 2023 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story