ఈ తరం క్రికెటర్లకు(Cricketers) డబ్బుకు కొదవలేదు. ఐపీఎల్‌లో(IPL) ఆడితే చాలు విలాసవంతమైన జీవితం కాదు కానీ సంతోషకరమైన జీవితం గడపడానికి సరిపడే డబ్బులు అందుతున్నాయి. కానీ పాతతరం క్రికెటర్లకు ఇంతటి రాజభోగాలు ఉండేవి కావు.
ఈ తరం క్రికెటర్లకు(Cricketers) డబ్బుకు కొదవలేదు. ఐపీఎల్‌లో(IPL) ఆడితే చాలు విలాసవంతమైన జీవితం కాదు కానీ సంతోషకరమైన జీవితం గడపడానికి సరిపడే డబ్బులు అందుతున్నాయి. కానీ పాతతరం క్రికెటర్లకు ఇంతటి రాజభోగాలు ఉండేవి కావు. విదేశీ క్రికెటర్ల(International Cricketers) పరిస్థితి మెరుగ్గా ఉండేది కాదు. క్రికెట్ సిరీస్‌లు లేని రోజుల్లో ఉద్యోగాలు చేసుకునేవారు. పెద్దగా వెనకేసుకునేవారు కూడా కాదు! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఒకప్పటి క్రికెట్ దిగ్గజం గ్రెగ్ ఛాపెల్(Greg Chappell) ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. 75 ఏళ్ల గ్రెగ్ భారత జట్టుకు(Team India) కోచ్‌గా(Coach) కూడా వ్యవహరించాడు.
ఆయనను ఆదుకోవడానికి ఫ్రెండ్స్ ముందుకు వచ్చారు. ఆన్‌లైన్‌లో విరాళాలను సేకరిస్తున్నారు. గో ఫండ్ మీ ద్వారా విరాళాల సేకరణకు నడుం బిగించారు. ఇందుకు ఛాపెల్ అయిష్టంగానే అంగీకరించాడట! తాను ఆర్ధికంగా అంత దారుణంగా ఏమీ దెబ్బతినలేదని, సాధారణ జీవితమే గడుపుతున్నానని గ్రెగ్ ఛాపెల్ చెప్పాడు. తీవ్రమైన కష్టాలలో ఉన్నానని తాను అనడం లేదని, అలాగని విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపడం లేదని అన్నాడు. క్రికెటర్లం కాబట్టి లగ్జరీ లైఫ్ గడుపుతున్నామని చాలా మంది అనుకుంటారని, అందులో నిజం లేదని చెప్పాడు.
కాకపోతే ఈ తరం క్రికెటర్లు పొందుతున్న విలాసవంతమైన ప్రయోజనాలను తాము పొందలేకపోతున్నామని పేర్కొన్నాడు. 'నా తరం క్రికెటర్లలో రిటైర్ అయిన తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్‌లో నేను భాగంగానే ఉన్నా. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం నేనొక్కడినే’’ అని గ్రెగ్ చాపెల్ తెలిపాడు. 1970-84 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన గ్రెగ్ ఛాపెల్ అద్భుతమైన బ్యాట్స్‌మన్. 1975 నుంచి రెండేళ్లపాటు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2005 నుంచి 2007 మధ్య కాలంలో భారత జట్టుకు కోచ్‌గా పని చేశారు. ఆ సమయంలో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారాయన. ఈయన సోదరులు ఇయాన్ ఛాపెల్, ట్రెవర్ ఛాపెల్‌లు కూడా క్రికెటర్లే!