ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా(Hardik Pandya)పై మాజీ క్రికెటర్ గవాస్కర్(Gavaskar) తీవ్ర ఆరోపణలు చేశాడు. పాండ్యా బౌలింగ్, కెప్టెన్సీ చాలా బలహీనంగా ఉందని మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆరోపించారు. స్టేడియంలోని అరుపులు, కేకల ప్రభావం పాండ్యాపై ఎక్కువ ఉన్నట్లు అర్థమవుతోందని పీటర్సన్ తెలిపారు. హార్దిక్ పాండ్యాపై ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
ముంబై కెప్టెన్ హార్థిక్ పాండ్యా(Hardik Pandya)పై మాజీ క్రికెటర్ గవాస్కర్(Gavaskar) తీవ్ర ఆరోపణలు చేశాడు. పాండ్యా బౌలింగ్, కెప్టెన్సీ చాలా బలహీనంగా ఉందని మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆరోపించారు. స్టేడియంలోని అరుపులు, కేకల ప్రభావం పాండ్యాపై ఎక్కువ ఉన్నట్లు అర్థమవుతోందని పీటర్సన్ తెలిపారు. హార్దిక్ పాండ్యాపై ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై జట్టు ఓటమి చవి చూసింది. అయితే ఆ మ్యాచ్‌లో పాండ్యా బౌలింగ్, కెప్టెన్సీ చాలా పేలవంగా ఉన్నట్లు మాజీ క్రికెటర్ గవాస్కర్ ఆరోపించారు. ముంబై కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి హార్దిక్‌పై ఆన్‌లైన్‌లో విమర్శలు వస్తున్నాయి. పాండ్యా వేసిన ఫైనల్ ఓవర్‌లో 26 పరుగులు పిండుకున్నారు. దాంట్లో ధోనీ ఒక్కడే 20 పరుగులు బాదారు. దీనిపై గవాస్కర్ కామెంట్ చేశాడు. ఇది నిజంగా పసలేని బౌలింగ్, కెప్టెన్సీ అని, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబేలు బాగా ఆడినా.. రన్స్‌ను అదుపు చేశారని, చెన్నైని 190 లోపే కట్టడి చేస్తే బాగుండేదని, కానీ చాలా దారుణమైన బౌలింగ్ వేసినట్లు గవాస్కర్ పేర్కొన్నాడు. మొదటి సిక్స్ ఓకే అని, కానీ ఆ తర్వాత లెన్త్ బాల్ వేశాడని, బ్యాటర్ పరుగుల దాహంతో ఉన్నప్పుడు అలాంటి బాల్ ఎలా వేస్తారని అన్నాడు. ఇక మూడో బాల్ ఫుల్ టాస్ వేయడం సరైంది కాదన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లు వేసిన పాండ్యా రెండు వికెట్లు తీసుకుని 43 పరుగులు ప్రత్యర్థి జట్టుకు అందించాడు